Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ధోనీని గంగూలీ ఏకిపారేస్తే.. షేన్ వార్న్ అండగా నిలిచాడు.. మహీకి ఆ అవసరం లేదంటూ ట్వీట్..

Widgets Magazine

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ ధోనీ ప్రదర్శనపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'ధోని వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్ ప్లేయర్. కానీ టీ20ల్లో ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని తానైతే అనుకోవట్లేదని గంగూలీ ఇటీవల కామెంట్లు చేశాడు. 
 
ఇందుకు కారణం పదేళ్ల ట్వంటీ-20 కెరీర్లో అతడు సాధించింది.. ఏకై అర్థ సెంచరీ మాత్రమేనని గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా ధోనీని గంగూలీ ఏకిపారేశాడు. ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభంలో పూణే కెప్టెన్సీ నుంచి తప్పించి కొందరు అవమానిస్తే.. క్రికెటర్‌గా, ఓ జట్టు సభ్యుడిగా బరిలోకి దిగిన ధోనీ ఆటతీరుపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 
 
ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోని ప్రస్తుత సీజన్‌లో మెరుగ్గా రాణించట్లేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ధోని 12 నాటౌట్, 5, 11, 5, 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో ధోనికి గడ్డు కాలం నడుస్తోంది. కెప్టెన్స్ నుంచి ధోనిని తప్పించడంతో జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దీంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ లెజండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ధోనీకి గట్టిగా అండగా నిలబడ్డాడు. ధోని ఎవరి దగ్గర తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అతను గొప్ప స్ఫూర్తిదాయకమైన కెప్టెన్‌ అంటూ షేన్ వార్న్ కొనియాడాడు.
 
ఈ నేపథ్యంలో షేన్‌ వార్న్‌ ట్విట్టర్‌లో ధోనీ గురించి స్పందించాడు. ధోనీ తన సత్తాను ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అన్నీ ఫార్మెట్లలోనూ అతడు అద్భుతమైన క్లాస్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. ఇంకా స్ఫూర్తిదాయకంగా నిలిచే గొప్ప కెప్టెన్ ధోనీ అంటూ ట్వీట్ చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఆల్‌రౌండర్ వాట్సన్ అవసరమయ్యే గేల్‌ను తప్పించాం.. తప్పేంటి: ఆర్సీబీ హెడ్ కోచ్ వెటోరి

వరుస పరాజయాలతో ప్రేక్షకుల అంచనాలను ఘోరంగా తప్పించిన ఆర్సీబీ జట్టులోంచి కీలక ఆటగాడిని ...

news

బంతికి, బ్యాట్‌కు మధ్య జరిగిన మహా పోటీలో గెలిచిన బంతి: సన్‌రైజర్స్‌కు చిరస్మరణీయ విజయం

ఐపీఎల్-10 సీజన్లో జరిగిన అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ...

news

వీవో ఐపీఎల్ పదో సీజన్: టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు రూ.15కోట్ల ప్రైజ్ మనీ

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు ...

news

ఇలా చతికిలపడితే కప్పు కాదు కదా చిప్ప కూడా రాదు: విరాట్ కోహ్లీ

సొంత గడ్డపై రైజింగ్ పూణె సూపర్‌గెయింట్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూడటంపై రాయల్ చాలెంజర్స్ ...

Widgets Magazine