శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By selvi

ఐపీఎల్ 2017 : వికెట్ కీపర్ పార్థివ్‌ పటేల్‌ అరుదైన రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లో భారత వికెట్‌కీపర్‌గా సేవలు అందించి, ప్రస్తుతం ఇపుడు ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న పార్థీవ్ పటేల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లో భారత వికెట్‌కీపర్‌గా సేవలు అందించి, ప్రస్తుతం ఇపుడు ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న పార్థీవ్ పటేల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
 
ముంబై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌‌లో 2 వేల పరుగులు పూర్తి చేసిన ఏడో వికెట్‌కీపర్‌గా అరుదైన రికార్డు అందుకున్నాడు.
 
అన్ని ఐపీఎల్ సీజ‌న్‌ల‌తో క‌లిపి ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 106 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో మొత్తం 104 ఇన్నింగ్స్‌‌లలో బ్యాటింగ్ చేసిన పార్థివ్‌.. మొత్తం 2015 పరుగులు పూర్తి చేశాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్‌‍లలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్లను పరిశీలిస్తే... 
 
1. రాబిన్‌ ఊతప్ప - 3,394 రన్స్
2. ఏబీ డివిలియర్స్‌ - 3,346 రన్స్
3. మహేంద్ర సింగ్‌ ధోనీ - 3,298 రన్స్
4. దినేశ్‌ కార్తీక్ - 2,619 రన్స్
5. బ్రెండన్‌ మెక్ కల్లమ్ - 2,474 రన్స్
6. గిల్ క్రిస్ట్ - 2,069 రన్స్
7. పార్థివ్‌ పటేల్ - 2015 రన్స్