శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఇలా చతికిలపడితే కప్పు కాదు కదా చిప్ప కూడా రాదు: విరాట్ కోహ్లీ

సొంత గడ్డపై రైజింగ్ పూణె సూపర్‌గెయింట్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూడటంపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇలాంటి పేలవ ప్రదర్శన వల్ల కప్పు ఎలా గెలు

సొంత గడ్డపై రైజింగ్ పూణె సూపర్‌గెయింట్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూడటంపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇలాంటి పేలవ ప్రదర్శన వల్ల కప్పు ఎలా గెలుస్తామని సహచర ఆటగాళ్లను ప్రశ్నించాడు. 
 
ఆదివారం సొంతగడ్డపై పూణెతో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో జట్టు పేలవ ప్రదర్శనపై కోహ్లీ స్పందిస్తూ... ఓడిపోవడం శోచనీయమని, ఇలాగే ఆడితే, ఈ సీజన్ పోటీల్లో విజయం సాధించడానికి తాము అర్హులం కాదన్నాడు. 
 
గత మ్యాచ్‌లో చాలాబాగా ఆడామని, పుణెతో మ్యాచ్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదన్నాడు. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నాడు. ఆఖరి ఓవర్లలో తమ బౌలర్లు ఎక్కువ పరుగులను సమర్పించుకున్నారని, అదే కొంపముంచిందన్నాడు. పుణె టీమ్ తమ కన్నా బాగా ఆడిందని చెప్పుకొచ్చాడు. గత సంవత్సరం తమ జట్టు చక్కగా రాణించిందని, అదేస్థాయి ప్రదర్శన ప్రతి యేటా సాధ్యం కాదని వెల్లడించాడు.
 
కాగా, ఈ మ్యాచ్‌లో పూణె జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.