Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అబ్బా ఎండలు బాబోయ్.. షర్టులిప్పి ప్రాక్టీస్ చేసిన కింగ్స్ క్రికెటర్లు.. ఐపీఎల్‌ నుంచి స్మిత్ అవుట్

Steven Smith

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంత గడ్డపై హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇందులో భాగంగా కింగ్స్ జట్టు క్రికెటర్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. తీవ్రంగా సాధన చేస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నారు. 
 
సూర్యుడి ప్రతాపంతో బెంబేలెత్తించడంతో స్వదేశీ క్రికెటర్ల విషయం పక్కనబెడితే.. విదేశీ ఆటగాళ్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఎండ తీవ్రత కారణంగా గురువారం తెల్లవారుజామున జరిగే ప్రాక్టీస్ సెషన్లలో క్రికెటర్లు షర్టులు తీసేసి పాల్గొన్నారు.
 
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కష్టాల్లో వున్న రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్-10వ సీజన్‌కు తాను దూరం కానున్నట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్వయంగా వెల్లడించాడు. కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళుతున్నట్టు తెలిపాడు. ఐపీఎల్‌కు ముందు భారత్‌కు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చిన సంగతి తెలిసిందే. సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ కుటుంబాలకు దూరమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో తమ ఫ్యామిలీతో గడపాలని స్మిత్ డిసైడైనాడు. ఇందులో భాగంగా ఆరు రోజుల పాటు ఐపీఎల్‌కు దూరమవుతున్నట్టు స్మిత్ చెప్పాడు. దీంతో, రెండు మ్యాచ్‌లకు స్మిత్ దూరం కానున్నాడు. అయితే స్మిత్ ఈ టోర్నీకే దూరమయ్యే ఛాన్సుందని క్రికెట్ పండితులు అంటున్నారు. కాగా ఏప్రిల్ 22వ తేదీన హైదరాబాదుతో పూణే తలపడనుంది.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సొంతగడ్డపై సన్ రైజర్స్ అదుర్స్.. పోరాడి ఓడిన డిల్లీ డేర్ డెవిల్స్

ఐపీఎల్‌ పదోసీజన్‌లో సొంతగడ్డపై తనకు తిరుగులేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి ...

news

ధోనీ స్టంపింగ్ కంటే వేగంగా మాల్యాకు బెయిల్ వచ్చింది.. రైతులనైతే అరెస్ట్ చేస్తారు..

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటూ.. చమత్కారాలు పోస్ట్ చేసే.. భారత మాజీ క్రికెటర్ ...

news

సచిన్ బయోపిక్‌పై రజనీకాంత్ ఏమన్నారు..? ఏప్రిల్ 26 కోసం అభిమానుల ఎదురుచూపు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బయోపిక్ ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ ట్రైలర్ విడుదలైన సంగతి ...

news

పదివేల పరుగుల క్లబ్‌లో గేల్: తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు

ఐపీఎల్ 10 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఊరించిన కల సాకారమైంది. టీ20 క్రికెట్ బాహుబలి క్రిస్ ...