శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (10:13 IST)

ఐపీఎల్ 2018 : సన్‌రైజర్స్‌కు షాక్... రాయల్ చాలెంజర్స్ గెలుపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊహించని పరాజయం చవిచూసింది. దీంతో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊహించని పరాజయం చవిచూసింది. దీంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ గ్యాంగ్ సత్తా చాటింది. ఫలితంగా ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌పై 14 పరుగుల తేడాతో గెలిచింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 39 బంతుల్లో 69 రన్స్ చేశాడు. మరోవైపు మొయిన్ అలీ కూడా చెలరేగి ఆడాడు. 34 బంతుల్లో 65 పరుగులు చేశాడు. వీరిద్దరు సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీల మోత మోగించారు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన గ్రాండ్ హోమ్ కూడా 17 బాల్స్‌లో 40 రన్స్ చేశాడు. 
 
ఆతర్వాత 219 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు తుదికంటా పోరాడింది. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగుల వరకు లాక్కొచ్చింది. కేన్ విలియమ్సన్ - మనీష్ పాండేలు కలిసి ఏకంగా 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. 
 
విలియమ్సన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 81 రన్స్ చేయగా, మనీష్ పాండే 62 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా, ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.