బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (17:29 IST)

చెన్నై కింగ్స్‌కు ఊరట... హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ..?

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కరోనా కాస్త ఊరటనిచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కరోనా బారినపడ్డ ఇద్దరు ఆటగాళ్లతో పాటు మిగతా సహాయ సిబ్బందికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. దీంతో హమ్మయ్య అంటూ చెన్నై ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐతో పాటు మిగతా ప్రాంఛైజీలు కూడా షాక్‌కు గురయ్యాయి. తాజాగా సీఎస్‌కే అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. 
 
చెన్నైకి చెందిన బౌలర్‌ దీపక్‌ చాహర్‌, యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరినీ బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు ట్రైనింగ్‌ను ప్రారంభించకపోవడంతో చెన్నై జట్టు ఇబ్బంది పడుతుంది.

నెగెటివ్‌గా తేలిన వారంతా సాధనలో పాల్గొనాలంటే సెప్టెంబర్‌ 3న నిర్వహించే టెస్టులో మరోసారి కోవిడ్‌-19 ఫలితం నెగెటివ్‌గా రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 12 వరకు చాహర్‌, గైక్వాడ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.