శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2016 (14:01 IST)

ఐపీఎల్-9: మే 1న పూణేలో రైజింగ్ పూణే-ముంబై ఇండియన్స్ మ్యాచ్: బాంబే హైకోర్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఐదు లక్షల లీటర్ల నీళ్ళు అవసరమని తేలింది. ఇప్పటికే ముంబై వంటి వాణిజ్య నగరంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లొద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖం చాటేసిన నేపథ్యంలో పూణే, విశాఖల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. 
 
వీటికోసం కనీసం 35 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుందని అంచనా. ఎండలతో అల్లాడుతున్న జనాలు గుక్కెడు నీళ్ళ కోసం పడిగాపులు పడుతున్నారు. మార్చి నుంచి మొదలైన ఈ పరిస్థితి ఏప్రిల్‌లోనూ కొనసాగుతోంది. ఇక మే నెల సంగతి చెప్పనే అక్కర్లేదు.

మహారాష్ట్రలో కరువు పరిస్థితుల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లను ఏప్రిల్ తర్వాత నిర్వహించరాదని బాంబే హైకోర్టు తీర్పునిస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం పెద్ద మనసుతో ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చునంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక మతలబు ఏమిటోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి తెలంగాణా ప్రభుత్వం దీనిపై నోరెత్తకపోవడం విడ్డూరంగా ఉంది.
 
అలాగే విశాఖలో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అలాగే పూణే-ముంబై ఇండియన్స్ మ్యాచ్ మే ఒకటో తేదీన జరుగనుంది. ఈ మ్యాచ్‌ను పూణేలోనే నిర్వహించాలని బాంబే హైకోర్టు బుధవారం పేర్కొంది. ఇప్పటికే బాంబే హైకోర్టు 13 మ్యాచ్‌లను వేదిక మార్పు చేయాల్సిందిగా సూచించింది.