శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (18:47 IST)

పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ క్రికెట్ మజా!

పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు అసలుసిసలైన క్రికెట్ మజాను.. ఆస్వాదించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమాన స్కోర్లు (191/6) చేశాయి. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం కోసం సూపర్ ఓవర్ను నిర్వహించారు. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది.
 
సూపర్ ఓవర్లో పంజాబ్ అదిరిపోయేలా ఆడింది. మోరిస్ వేసిన తొలి బంతికి మిల్లర్ అవుట్ కాగా, రెండో బంతికి మ్యాక్స్‌వెల్ సింగిల్ తీశాడు. తర్వాత వరుసగా మూడు బంతులకు మార్ష్ మూడు ఫోర్లు కొట్టాడు. ఇందులో ఒకటి నోబాల్.  ఇక చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగే  రావడంతో పాటు మార్ష్ రనౌటయ్యాడు. దీంతో పంజాబ్ మొత్తం 15 పరుగులు చేసింది.
 
అలాగే సూపర్ ఓవర్లో రాజస్థాన్ 16 పరుగుల విజయలక్ష్యంతో రాజస్తాన్ బరిలోకి దిగింది. జాన్సన్ వేసిన తొలి బంతికి వాట్సన్ బౌల్డయ్యాడు. తర్వాతి బంతికి స్మిత్ ఫోర్ కొట్టినా. అది నోబాల్ కావడంతో మొత్తం 5 పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి ఫాల్క్‌నర్ అనూహ్యంగా రనౌట్‌కావడంతో రాజస్తాన్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓడింది. దీంతో పంజాబ్ గెలిచింది.