Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోచ్‌గా ఫ్లెమింగ్.. చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడనన్న ధోనీ

శుక్రవారం, 19 జనవరి 2018 (17:56 IST)

Widgets Magazine

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. సీఎస్‌కే జట్టుకు గాను ఆ జట్టు యాజమాన్యం కోచ్‌ను ప్రకటించింది.
 
ఇందులో భాగంగా జట్టు ప్రధాన కోచ్‌ బాధ్యతలను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీపెన్‌ ఫ్లెమింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌గా భారత ఆటగాడు లక్ష్మిపతి బాలాజీ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు సీఎస్‌కే నూతన చీఫ్‌ కాశీ ప్రకటించారు. గ‌తంలో కూడా ఫ్లెమింగ్ చెన్నై జ‌ట్టుకి కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చిన చెన్నై టీమ్ యాజమాన్యం.. రిటెన్షన్ పాలసీలో ధోనీని తీసుకుంది. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ఐపీఎల్‌లో చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడే ప్రసక్తే లేదన్నాడు. చెన్నై కాకుండా మరో టీమ్ గురించి ఆలోచించలేదని ధోనీ తెలిపాడు. చెన్నైకి తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మహిళా క్రికెటర్‌ నుంచి రూ.27 లక్షలు డిమాండ్ చేస్తున్న పశ్చిమ రైల్వే

ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీలో ...

news

"బెస్ట్ 11" ఎవరో మీరు చెప్పండి... మీడియాపై కోహ్లీ గరంగరం

అసలే టెస్ట్ ఓటమి బాధలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాపై అసహనం ...

news

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు: కోహ్లీ ఇన్నింగ్స్ వృధా.. 135 పరుగుల తేడాతో ఓటమి

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో ...

news

సెంచూరియన్ టెస్టు : విజయానికి 252 రన్స్ దూరంలో కోహ్లీ సేన

సెంచూరియన్ పార్క్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ...

Widgets Magazine