శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2015 (11:23 IST)

ఐపీఎల్‌లో బుకీల పంట: 12 సెకన్లని క్యాష్ చేసుకుంటున్న..!

ఐపీఎల్‌లో బుకీల పంట పండుతోంది. కోట్లాది రూపాయల మొత్తం స్పాట్ బెట్టింగ్‌ల రూపంలో వారి ఖాతాల్లోకి చేరుతోంది. ఇంకా షాకింగ్ న్యూస్ ఏమిటంటే..? స్పాట్ బెట్టింగ్ అంటే నాలుగు నుంచి ఐదు సెకన్ల వ్యవధిలో లక్షలాది రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. వాస్తవానికి మైదానంలో ఆటకు, టీవీలో లైవ్ రావడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
అయితే, ఈ ఐపీఎల్ ప్రసారం ఏకంగా 12 సెకన్ల ఆలస్యంగా టీవీల్లోకి వస్తోంది. ఇదే బుకీలకు వరమైంది. ఈ వ్యవధిని సొమ్ము చేసుకునేందుకు తమ మనుషులను మైదానంలో పెట్టి బాల్ పడగానే ఏం జరిగిందన్నది తెలుసుకుని బెట్టింగ్ మొదలుపెడతారు. సెకన్ల వ్యవధిలో బెట్ కట్టిన అభిమానులు తమ డబ్బు కోల్పోతున్నారు. ఈ మ్యాచ్ల ఫీడ్ తొలుత సింగపూర్ సర్వర్లలోకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి భారత్‌లోని డిష్‌లకు అందాల్సి వుండడమే ఈ 12 సెకన్ల ఆలస్యానికి కారణం. ఒకవేళ అదృష్టవశాత్తూ బెట్టింగ్ పెడుతున్న వ్యక్తి నిజం చెబితే, బుకీలు దాన్ని స్వీకరించరు.
 
ఎందుకు తీసుకోలేదని అడిగేలోగానే సమయం మించిపోతుంది కాబట్టి చేసేది కూడా ఏమీ ఉండదు. మొత్తం ఆన్ లైన్, ఫోన్ల మాద్యమంగా జరుగుతున్న బెట్టింగ్‌ను ఎలా ఆపాలో తెలియక అధికారులు తలపట్టుకుంటారు.