మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 18 మే 2017 (03:01 IST)

గుండెపగిలిన సన్ రైజర్స్.. ఐపీఎల్ నుంచి ఔట్.. వర్షం నేపథ్యంలో లక్ష్యాన్ని ఛేదించిన గంభీర్ సేన

ప్రకృతి వైపరీత్యం ఎదురైతే ఎంత మంచి జట్టయినా బరిలోంచి ఎలా తప్పుకోవలిసి వస్తుందో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టుకు ఎన్నడూ మర్చిపోలేని చేదు అనుభవంతో తెలిసి వచ్చింది. కుండపోత వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ పూర్తిగా సాగకుండా ఆరు ఓవర్లలో 48 పరుగులు ఛేదన

ప్రకృతి వైపరీత్యం ఎదురైతే ఎంత మంచి జట్టయినా బరిలోంచి ఎలా తప్పుకోవలిసి వస్తుందో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టుకు ఎన్నడూ మర్చిపోలేని చేదు అనుభవంతో తెలిసి వచ్చింది. కుండపోత వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ పూర్తిగా సాగకుండా ఆరు ఓవర్లలో 48 పరుగులు ఛేదనను అడ్డుకోవలసివచ్చిన సంక్లిష్ట పరిస్థితిలో సన్ రైజర్స్ తీవ్ర ఒత్తిడితో ఐపీఎల్-10 సీజన్‌నుంచి అనూహ్యంగా తప్పుకుంది. ప్రకృతి కారణంగా అందివచ్చిన అవకాశాన్ని టెన్షన్ ఫ్రీతో అందుకున్న కొల్‌కతా నైట్ రైడర్స్ రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌ బెర్త్‌ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.
 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు బుధవారం ఒక పీడకలను తలపించింది. టోర్నీ ఫేవరైట్లుగా, గతేడాది ఛాంపియన్లుగా బరిలో దిగి మొత్తంమీద ప్రతిభతో సెమీ ఫైనల్ వరకు వచ్చిన సన్ రైజర్స్ వాతావరణం అనుకూలించని కారణంగా అనూహ్య పరాజయం పాలైంది. కుదించిన ఆటలో ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం.. తొలి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు ఫట్‌.. అయినా గౌతం గంభీర్‌ సమయోచిత బ్యాటింగ్‌తో గతేడాది ఎలిమినేటర్‌లో జరిగిన ఓటమికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌ బెర్త్‌ కోసం అమీతుమీ తేల్చుకోనుంది. అటు మందకొడి పిచ్‌పై బ్యాటింగ్‌ చేసేందుకు తెగ ఇబ్బంది పడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. వార్నర్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించింది.
 
భారీ వర్షం మూడు గంటలపాటు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పైచేయి సాధించింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. అంతకుముందు చిన్నస్వామి మైదానంలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 128 పరుగులు చేసింది. చిన్నస్వామి మైదానంలో బుధవారం జరిగిన  మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో  ఏడు వికెట్లకు 128 పరుగులు చేసింది. 
 
టాస్‌ ఓడి  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు పిచ్‌ నుంచి ఆశించిన సహకారం అందలేదు. మందకొడిగా ఉండడంతో పరుగులు తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. దీనికి తోడు ఉమేశ్‌యాదవ్‌ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాటు ఐదో ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ (13 బంతుల్లో 11; 1 ఫోర్‌) వికెట్‌తో దెబ్బతీశాడు. దీంతో పవర్‌ప్లేలో కేవలం మూడు ఫోర్లు మాత్రమే రాగా జట్టు 30 పరుగులు చేయగలిగింది. ఇది ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 
 
48 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయింది. రెండో బంతినే లిన్‌ (6) సిక్స్‌గా మలిచినా మరుసటి బంతికే భువనేశ్వర్‌ అతడిని పెవిలియన్‌కు పంపాడు. నాలుగో బంతికి యూసుఫ్‌ లేని పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. జోర్డాన్‌ వేసిన రెండో ఓవర్‌లోనే ఉతప్ప (1) భారీ షాట్‌ ఆడి ధావన్‌కు క్యాచ్‌ ఇవ్వగా గంభీర్‌ ఓ సిక్స్‌ బాదాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో గంభీర్‌ 4,6 బాది ఒత్తిడిని తగ్గిస్తూ 14 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్‌లో 2 పరుగులు కావాల్సి ఉండగా సునాయాసంగా నెగ్గింది.