Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఊరించిన విజయం. బెంగళూరుపై పుణె సంచలన విజయం

హైదరాబాద్, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (00:42 IST)

Widgets Magazine

ఐపీఎల్ పదో సీజన్‌లో వరుసగా మూడు పరాజయాల అనంతరం రైజింగ్ పుణె సూపర్ జైయింట్ పుంజుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పుణె జట్టు 27 పరుగుల తేడాతో చివరి వరకూ పోరాడి విజయాన్ని అందుకుంది. 162 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లి (28 19 బంతుల్లో 3x4, 1x6), ఏబీ డివిలియర్స్ (29 30 బంతుల్లో 1x4, 2x6) నిలకడగా ఆడటంతో తొలుత అలవోకగా గెలిచేలా కనిపించినా.. చివరికి 1349కే పరిమితమైంది.
vizag cricket stadium


ఒత్తిడి తలొగ్గిన కేదార్ జాదవ్ (18), షేన్ వాట్సన్ (14), స్టువర్ట్ బిన్నీ (14), పవన్ నేగి (10) భారీ షాట్లకి ప్రయత్నించి వరుసగా ఔటైపోవడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. పుణె బ్యాట్స్‌మెన్లు విఫలమైనా.. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ని కాపాడారు. శార్దూల్, బెన్ స్టోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఉనద్కత్ రెండు, ఇమ్రాన్ తాహిర్ ఒక వికెట్ తీశారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సొంత మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తడ'బ్యాటు'తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఆర్సీబీపై 27 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ విజయం సాధించింది. పుణే బౌలర్లు రాణించడంతో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పుణే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణెకు ఓపెనర్లు శుభారంభం అందించారు. అజింక్యా రహానే(30; 25 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(31; 23 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్), కెప్టెన్ స్టీవ్ స్మిత్(27; 24 బంతుల్లో3 ఫోర్లు), ఎంఎస్ ధోని(28; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు ఓ మోస్తరుగా రాణించారు. మనోజ్ తివారీ 11 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లతో 27 పరుగులు సాధించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు చేసింది
 
162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్ మన్‌దీప్ సింగ్ రెండో ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(28; 19 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్(29; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. స్టోక్స్ బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టడంతో రెండో వికెట్ గా కోహ్లీ ఔటయ్యాడు. తాహిర్ బౌలింగ్ లో క్రీజు వదిలి ముందుకు వచ్చిన డివిలియర్స్.. ధోనీ అద్బుత స్టంప్‌తో నిరాశగా వెనుదిరిగాడు. ఆ పై వరుస విరామాల్లో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది.
 
వాట్సన్(14), జాదవ్(18), స్టూవర్ట్ బిన్నీ(18; 8 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్) షాట్లు ఆడే క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యారు. పుణే బౌలర్లు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులకు పరిమితమైంది. దీంతో 27 పరుగులతో పుణే మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పుణే బౌలర్లలో స్టోక్స్, ఠాకూర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా, తాహిర్ కు ఒక వికెట్ దక్కింది.

కోబ్లీ, డివీలియర్స్ వంటి హేమాహేమీలున్న బెంగళూరు జట్టు వరుస పరాజయాల బాట పట్టడం ఐపీఎల్ -10 సీజన్‌‌‌ను సంచలనాత్మగంగా మార్చింది

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

జట్టు ల్యాప్ టాప్‌ను పగలగొట్టిన శిఖర్ ధావన్.. కళ్లురిమిన వీవీఎస్ లక్ష్మణ్

డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సొంత జట్టు ల్యాప్‌టాప్‌ను పగులగొట్టాడు. దీంతో జట్టు మెంటార్ ...

news

ఆండర్సన్, బిల్లింగ్స్ బ్యాటింగ్ థమాకా: ఢిల్లీ మరో ఘనవిజయం

అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సమష్టి ప్రదర్శన కనబరచిన ఢిల్లీ.. పటిష్టమైన బ్యాటింగ్ ...

news

చతికిలబడ్డ సన్ రైజర్స్... కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం

ఔను... సన్ రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. 17 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పైన కోల్ కతా నైట్ ...

news

కోహ్లీ అంత మాట అన్నా ఫర్వాలేదు. నేనెప్పుడూ భారత్ మిత్రుడినే: ఉబ్బేసిన వార్నర్

భారత క్రికెటర్లలో ఏ ఒక్కరితోనూ తనకు విభేదాలు లేవని, ఎల్లప్పుడూ భారత క్రికెటర్లకు మంచి ...

Widgets Magazine