అందరి దైవం నీవమ్మా... నాగులమ్మా

WD
కోరిన కోర్కెలు నెరవేర్చుకునేందుకు... ప్రజలు తమ ఇష్టదైవాలను పూజిస్తుంటారు. అంతేకాదు తమ కోర్కెలు తీరినందుకు గాను ఆ దేవతలకు తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు అంతా దైవానిదే భారమంటూ ముందుకు సాగుతారు. మన దేశం, రాష్ట్రంలోనూ ఇటువంటి విశ్వాసాలను అనేకం చూడవచ్చు.

వాస్తవ్యులు తమ ఇష్టదైవమైన నాగులమ్మను పూజిస్తుంటారు. అంతేకాదు వందేళ్లక్రితం వెలసిన నాగులమ్మ దేవాలయం సాక్షిగా తమ పేర్లను నాగులమ్మ పేరు కలిసివచ్చేటట్లు పెట్టుకోవటం విశేషం. ఇక్కడి నాగులమ్మ దేవాలయానికి అరకిలోమీటరు వరకు నాగదేవతను పోలి ఉన్న రాళ్లు మనకు కనిపిస్తాయి. సుమారు మూడువేల మంది నివాసముంటున్న నాగులమ్మపేటలో అందరి పేర్లు న తో మొదలై ఉండటం విశేషం. అది ఒకప్పటి తరం ఆచరించిన పద్ధతి అనుకుంటే పొరపాటే... నేటికీ వారు ఇదే పద్ధతిని ఆచరిస్తున్నారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
పిల్లలు కలగని దంపతులు ఇక్కడికి వచ్చి నాగులమ్మకు మొక్కుకుంటారు. దేవత కరుణ ఫలంగా తమ కోర్కెలు నెరవేరుతున్నాయని భక్తులు చెపుతున్నారు. ఫలితంగా ఈ ప్రాంతానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. వారానికోసారి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. మరికొన్ని విశేషాలను వీడియోలో వీక్షించండి.


దీనిపై మరింత చదవండి :