దున్నపోతుల పోటీతో దేవి కృప

WD
తమిళనాట జల్లికట్టు క్రీడ ఎంత ఉత్కంఠను రేకిత్తిస్తుందో మన అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో హిమాచల్ ప్రదేశ్‌లోని మషోబ్రా గ్రామంలో దున్నపోతుల మధ్య పోటీని ఏడాదికోసారి నిర్వహిస్తారు. అయితే తమిళనాట మనకు తెలిసిన జల్లికట్టులో పొగరుబోతు ఎద్దుతో వ్యక్తులు పోరాడతారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
కానీ హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించే దున్నపోతుల పోటీలో దున్నపోతుల మధ్యనే యుద్ధం జరుగుతుంది. వాటిని రెచ్చగొట్టి పరస్పరం పొడుచుకునే విధంగా కోలాహలం చేస్తారు అక్కడి జనం. ఏడాదికోసారి నిర్వహించే ఈ పోటీల్లో దున్నపోతులకు ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం. భగంవతుని మహిమ వల్లనే ఇది సాధ్యపడుతుందని వారు అంటున్నారు. అంతేకాదు దేవీ కృపను పొందటానికి దున్నపోతుల పోటీ నిర్వహిస్తున్నట్లు వారు చెపుతున్నారు.


దీనిపై మరింత చదవండి :