శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. ఇదీ సంగతి
Written By WD

బీహార్‌లో 'మానవసర్పం'

అత్యున్నతమైన శాస్త్రసాంకేతిక ఆవిష్కారాలు చోటు చేసుకుంటున్న 21వ శతాబ్దపు నవసమాజంలో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని నవడ పట్టణానికి చెందిన మగర్ విగాహ ప్రాంతానికి చెందిన ప్రజలు తమలోని ఒక యువకుడు మానవసర్పంగా సంచరిస్తున్నాడని విశ్వసిస్తున్నారు.

స్థానికులు అందించిన సమాచారాన్ని అనుసరించి విజయ్ కుమార్ అనే 17 సంవత్సరాల యువకుడు నాగు పాము వలె ప్రవర్తించడం ప్రారంభించాడు. అతని ప్రజలలో తీవ్రభయాందోళనలను రేకెత్తించింది. స్థానిక పోలీసు శిబిరంలో వంటవానిగా పనిచేసే విజయ్ కుమార్‌కు వింతైన అనుభవం ఎదురైంది. నాగుపామును ఎల్లప్పుడు అంటిపెట్టుకుని ఉండి, పాము నుంచి ఎప్పటికీ వేరుపడని 'నాగమణి' అతని కంటపడింది. నాగమణిని పొందినవారు రాత్రికిరాత్రే ధనవంతులు అవుతారన్నది స్థానికుల నమ్మిక.

నాగమణి సంఘటన అక్టోబర్ 20న నవరాత్రులలోని మహానవమి నాడు చోటు చేసుకుంది. నాగమణిని చూడగానే విజయ్ దానిని హస్తగతం చేసుకున్నాడు. మరుక్షణం అతనిని ఒక నాగుపాము వెంటాడటం మొదలు పెట్టింది. వెంటాడుతున్న పామును చూసి భయంతో విజయ్ కుమార్ పెట్టిన కేకలకు పోలీసులు వచ్చి నాగపామును చంపేశారు.

ఆడనాగపాము ప్రభావంతోనే సంఘటన జరిగిన నాటి నుంచి విజయ్ కుమార్ పాములా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు నమ్మబలుకుతున్నారు. విజయ్ కుమార్‌ను మాములు మనిషిగా మారుద్దామని స్థానికంగా పాములు వశపరచుకునేవారు, మూలికావైద్యులు మరియు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

చికిత్స చేద్దామని వచ్చిన వైద్యులను చూడగానే విజయ్ నాగుపాములా బుసకొడుతూ వారిని కాటువేసేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానికులు చెపుతున్నారు. ఈ సంఘటన ఆనోటా ఈనోటా పాకడంతో పురాణాలలో ఇటువంటి పోలికలున్న కథలను స్థానికులు నెమరు వేసుకుంటున్నారు.