బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 జులై 2016 (15:35 IST)

కాలక్షేపం కోసం ట్వీట్లు.. 1.80 లక్షల మంది ఫాలోయర్లు.. రూ.కోట్లు గడిస్తున్న యువకుడు.. ఎలా?

ప్రస్తుతం సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా.. క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. దీంతో అనేక మంది యువతి గంటల కొద్దీ సమయాన్ని సోషల్ మీడియాలో వెచ్చిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా.. క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. దీంతో అనేక మంది యువతి గంటల కొద్దీ సమయాన్ని సోషల్ మీడియాలో వెచ్చిస్తున్నారు. ఓ యువకుడు సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడపడం కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేశాడు. కానీ, ఆ నిర్ణయమే అతనికి కోట్లు కురిపిస్తోంది.
 
ఆ యువకుడి పేరు క్రిస్. వయసు 29 యేళ్లు. ఆసక్తికర విషయాలను స్నేహితులతో పంచుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం. ఇందుకోసం 'ఉబర్‌ ఫ్యాక్ట్స్' పేరుతో ఓ ట్విట్టర్ ఖాతాను తెరిచాడు. అందులో ప్రతిక్షణం అత్యంత ఆసక్తికర విషయాలను పోస్ట్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో అతని ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లతో కలిపి క్రిస్‌ ఫాలోవర్ల సంఖ్య కోటీ ఎనభై లక్షలు. ఆ ఫాలోయింగే క్రిస్‌కు కోట్లు తెచ్చిపెడుతోంది.
 
కొన్ని వెబ్‌సైట్లు, పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వెబ్‌సైట్లు కొంత ఆసక్తికర సమాచారాన్ని క్రిస్‌ అకౌంట్లో పెడతాయి. పూర్తి సమాచారం కావాలంటే క్లిక్‌ చేయండి అంటూ తమ సైట్‌ అడ్రస్‌ ఇస్తాయి. అలా ఎంత మంది క్రిస్‌ అకౌంట్‌ నుంచి సదరు వెబ్‌సైట్లకు మళ్లుతున్నారో లెక్కగట్టి అంత డబ్బు క్రిస్‌కు అందిస్తాయి. అలాగే, ఉత్పత్తి సంస్థలు క్రిస్‌ అకౌంట్లో తమ ప్రకటనలు పెట్టుకుని డబ్బులు చెల్లిస్తాయి. ఇలా పలు మార్గాల ద్వారా క్రిస్‌ యేడాదికి మూడు కోట్ల రూపాయలపైనే సంపాదిస్తున్నాడు.