Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.500కే 4జీ స్మార్ట్ ఫోన్.. రూ.60కే ఫ్రీ కాల్స్

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (11:49 IST)

Widgets Magazine
airtel 4g phone

టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన రిలయన్స్ జియోను దెబ్బకొట్టేందుకు కొన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వీటిలో ప్రధానంగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో వోడాఫోన్, ఐడియా కంపెనీలు చేతులు కలుపుతున్నాయి. ఈ టెలికాం కంపెనీలన్నీ కలిసి అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఫోన్ ధర రూ.500కే 4జీ స్మార్ట్ ఫోన్‌ను అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
ఈ ఫోన్ ద్వారా నెలకు రూ.60 లేదా రూ.70కే ఉచిత ఫోన్ కాల్ సౌకర్యాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. తద్వారా తమ ఆదాయానికి గండికొట్టిన రిలయన్స్ జియోను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇందుకోసం ఫోన్ల తయారీ సంస్థలతో టెలికం ఆపరేటర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సాధ్యమైతే ఇక ఫీచర్ ఫోన్ శకం ముగిసిపోయినట్టుగానే భావించాలి. 
 
టెలికాం కంపెనీలకు ఈ ఆలోచన రావడానికి కారణం లేకపోలేదు. దీనకంతటికీ కారణం రిలయన్స్ జియోనే. ఫీచర్ ఫోన్‌లో కేవలం రూ.49కే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో కూడిన ప్లాన్‌ను జియో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రస్తుత టెలికం కంపెనీలకు భయం పట్టుకుంది. పెద్ద ఎత్తున కస్టమర్లు జియో వైపు వెళతారేమోనన్న ఆందోళనతో కస్టమర్లను కోల్పోకుండా నూతన వ్యూహాలకు పథక రచన చేస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్... వస్తువులను కొనండి, అమ్ముకోండి...

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ త్వరలో మనకు పరిచయం కాబోతోంది. ఇంతకీ ఈ ఎఫ్బీ ఫ్రీ మార్కెట్ ...

news

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏకంగా 50శాతం వేతనాల పెంపు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ...

news

కొనసాగుతున్న జియో జోరు: డౌన్‌లోడింగ్ స్పీడులో అగ్రస్థానం

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ ...

news

ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్‌ను ప్రారంభించిన విప్రో

ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో తాజాగా ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ షోను ఏర్పాటు చేసింది. ఇండోర్, ...

Widgets Magazine