రూ.99 ప్లాన్‌లో మార్పులు చేసిన ఎయిర్‌టెల్.. జియో దెబ్బకు...

శనివారం, 16 జూన్ 2018 (15:52 IST)

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరల విషయంలో రోజురోజుకూ దిగివస్తోంది. తనకంటే ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్ సేవలపై తమ కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో వారిని కాపాడుకునేందుకు వీలుగా తన ప్లాన్‌లలో మార్పులు చేస్తోంది.
airtel
 
ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్ తన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ మార్పుల మేరకు ఇకపై నెలకు 2జీబీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. 
 
నిజానికి ఇప్పటివరకు రూ.99 ప్లాన్‌లో నెలకు ఒక జీబీ డేటా మాత్రమే ఉచితం. రిలయన్స్ జియో రూ.98 ప్లాన్‌లో నెలకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లను ఆఫర్ చేస్తోంది. 
 
దీంతో ఎయిర్‌టెల్ కూడా దిగివచ్చింది. రూ.99 ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగా అందివ్వనుంది. బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే ప్లాన్ కింద రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :  
రిలయన్స్ జియో రూ.99 ప్లాన్ Airtel Jio ఎయిర్‌టెల్ Unlimited Calls Prepaid Plan

Loading comments ...

ఐటీ

news

అడిగినా చెప్పొద్దు... అది లేకుండానే సిమ్ తీసుకోండి...

ఇకపై కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నంబరు చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ టెలికాం ...

news

FIFAWorldCup2018 ఆఫర్ .. రూ.149 ప్లాన్‌తో రోజుకు 4 జిబి డేటా

ప్రతిష్టాత్మక సాకర్ పోటీలను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ ...

news

ఎయిర్‌టెల్‌కు చెక్.. జియో డబుల్ ధమాకా... రోజూ అదనంగా 1.5జీబీ ఫ్రీ

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో తాజా మరో బంపర్ ఆఫర్‌తో ...

news

రోజుకు 2జీబీ డేటా.. ఎయిర్‌టెల్ న్యూ ప్లాన్

దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన పోటీ కారణంగా అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా ...