శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 జులై 2015 (12:38 IST)

3జీ సేవలకు బైబై.. ఇక 4జీ సేవలకు ఎయిర్‌టెల్ రంగం సిద్ధం!

3జీ సేవలకు బైబై . ఇక 4జీ సేవలు ప్రారంభం కానున్నాయి. 4జీ సేవలను ప్రారంభించేందుకు ఇప్పటికే ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూపు రిలయన్స్ జియో పేరిట భారీ సన్నాహాలు చేస్తోంది.

వినూత్న ప్లాన్లతో 4జీ వ్యాపారంలో సింహభాగాన్ని సొంతం చేసుకునేందుకు రిలయన్స్ పక్కా ప్రణాళికలు రచించింది. అయితే ఇప్పటిదాకా మొబైల్ సర్వీసుల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా కొనసాగుతూ వస్తున్న ఎయిర్‌టెల్ కూడా దాదాపుగా రంగంలోకి దిగేసింది. 
 
రిలయన్స్ జియోకు ధీటుగా భారీ ఆకర్షణీయ పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ.4 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్‌ను అందించేందుకు సన్నాహాలు జరుపుతోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు సంస్థలతో సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్ టెల్ మాట్లాడిందట. వీలైనంత త్వరలో తన 4జీ ప్లాన్‌లను విడుదల చేసేందుకు ఎయిర్ టెల్ రంగం సిద్ధం చేసుకుంటోంది.