Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

3జీ సేవలకు టాటా చెప్పనున్న ఎయిర్‌టెల్

గురువారం, 2 నవంబరు 2017 (10:24 IST)

Widgets Magazine
airtel

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్ముందు 3జీ సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడు, నాలుగేళ్ళలో ఈ సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి. అదేసమయంలో 2జీ, 4జీ సేవలను కొనసాగించనుంది. ఈ రెండింటిపై ఎక్కువ పెట్టుబడులు పెట్టనుంది. 
 
ఇదే అంశంపై ఆసంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. రానున్న 3 నుంచి 4 ఏళ్లలో 3జీ సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాటి స్పెక్ట్రమ్ లను 4జీ సర్వీసులకు జత చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని ప్రకటించింది. తమ నెట్ వర్క్‌లో డేటా సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయడం కోసం 4జీ టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు. 
 
ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం 2100 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లను వాడుతున్నామని... తమ స్పెక్ట్రమ్‌లో ఎక్కువ భాగాన్ని 4జీ సర్వీసులకే కేటాయిస్తున్నామని చెప్పారు. కొన్ని టెలికాం సర్కిళ్లలో అత్యాధునిక 3జీ పరికరాలను అమరుస్తున్నామని... అవి 4జీకి సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ఈ పరికరాలను తర్వాత రీప్లేస్ చేస్తామని చెప్పారు. టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్న విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ ఫీచర్....

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ యాప్‌ ఫీచర్ అందుబాటులోకి ...

news

యూట్యూబ్‌లో ''యూట్యూబ్ మ్యూజిక్'' కొత్త యాప్.. స్క్రీన్ ఆన్‌లో?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన యూట్యూబ్ నుంచి త్వరలో మ్యూజిక్ యాప్ వినియోగదారులకు ...

news

ఎయిర్ టెల్ నుంచి రూ.1,349కే సెల్‌కాన్‌ స్మార్ట్‌ 4జీ: రీఫండ్ పొందాలంటే ఏం చేయాలి..?

ఉచిత డేటా పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు టెలికాం ...

news

ఎయిర్‌టెల్.. 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్...

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు వంద శాతం క్యాష్ బ్యాక్ ...

Widgets Magazine