శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (17:01 IST)

ఆ డివైజ్‌లలో వాట్సాప్ పని చేయదు... డెడ్‌లైన్ ఖరారు

సోషల్ మీడియాల్లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ఖచ్చితంగా ఇది చేదువార్తే. వచ్చే జూన్ 30వ తేదీ తర్వాత వాట్సాప్ అప్లికేషన్.. విండోస్ 7 ఆధారిత డివైజెస్‌లో పనిచేయదు. ఈ విషయాన్ని వాట్సాప్ యాజమాన్యం అధికారికంగా ప్

సోషల్ మీడియాల్లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ఖచ్చితంగా ఇది చేదువార్తే. వచ్చే జూన్ 30వ తేదీ తర్వాత వాట్సాప్ అప్లికేషన్.. విండోస్ 7 ఆధారిత డివైజెస్‌లో పనిచేయదు. ఈ విషయాన్ని వాట్సాప్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 
 
విండోస్ 7 అప్లికేషన్‌కు తగినట్టుగా తాము వాట్సాప్ సేవలను అందించలేమని, అందుకే వాట్సాప్‌ను ఆ డివైజ్‌లకు నిలిపివేయాలని భావిస్తున్నట్లు వాట్సాప్ ప్రతినిధులు తాజాగా ప్రకటించారు. నిజానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత బాధ కలిగించినప్పటికీ... మరో మార్గం లేక ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
వాట్సాప్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో విండోస్ ఆధారిత డివైజ్‌ల్లో వాట్సాప్ జూన్ తర్వాత కనుమరుగు కానుంది. పోస్ట్‌లు పంపించినా పనిచేయవని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే గతంలో విండోస్ అప్లికేషన్‌కు తగిన మార్పులు చేర్పులను చేసేందుకు వాట్సాప్ సిద్ధమైనట్టు వార్తలు కాగా, వాటిని వాట్సాప్ కొట్టిపారేసింది. అలాంటి చర్యలు తాము చేపట్టలేదని స్పష్టం చేసింది.