శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (17:12 IST)

ఆపిల్ హవా.. మైక్రో మాక్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి.. టాప్‌లో శాంసంగ్

భారత మార్కెట్లో ఆపిల్ ఫోన్ల కంపెనీ గణనీయంగా వృద్ధిని సాధించింది. దేశీయ మార్కెట్లో మైక్రో మాక్స్‌ను వెనక్కి నెట్టి ఆపిల్ ఇండియా కంపెనీ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దేశీయ మార్కెట్లో మైక్రో మాక్స్‌ను

భారత మార్కెట్లో ఆపిల్ ఫోన్ల కంపెనీ గణనీయంగా వృద్ధిని సాధించింది. దేశీయ మార్కెట్లో మైక్రో మాక్స్‌ను వెనక్కి నెట్టి ఆపిల్ ఇండియా కంపెనీ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దేశీయ మార్కెట్లో మైక్రో మాక్స్‌ను వెనక్కి నెట్టి ఆపిల్ ఇండియా కంపెనీ తన స్థానాన్ని మెరుగుపర్చుకొంది. 
 
54శాతం వృద్ధితో ఆపిల్ కంపెనీ పదివేల కోట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. చైనా నుండి వచ్చే సెల్ ఫోన్ కంపెనీల పోటీ కారణంగా మైక్రో మ్యాక్స్ కంపెనీ నష్టపోవడంతో పాటు, ఆపిల్ తన పాత హ్యాండ్ సెట్ల ధరలను భారీగా తగ్గించడం ద్వారా మైక్రోమాక్స్ డౌన్ అయ్యింది.
 
దేశీయ మొబైల్ రంగంలో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ సంస్థ స్థానాన్ని ఆపిల్ ఇండియా ఆక్రమించింది.21 శాతం నికర లాభంతో 294 కోట్లను ఆర్జించింది. గత ఏడాదిలో ఈ కంపెనీ 6472 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అయితే ఇదే సమయంలో మెక్రో మ్యాక్స్ అమ్మకాలు 6 శాతం తగ్గిపోయాయి. ఇక మొబైల్ ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.