గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (14:56 IST)

బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు వై-ఫై సౌకర్యం.. దేశంలోనే మొదటిది!

దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు సిటీనిలో రైల్వే స్టేషన్‌ సరికొత్త రికార్డును సృష్టించనుంది. వై-ఫై సౌకర్యం కలిగిన తొలి స్టేషన్‌గా ఖ్యాతిగడించనుంది. ఈ స్టేషన్‌లో 30 నిమిషాలపాటు ప్రయాణికుల మొబైల్ ఫోన్లపై ఉచితంగా వై-ఫై సేవలు అందుకోవచ్చు. ఆ తర్వాత కూడా వై-ఫై సదుపాయం పొందాలంటే స్టేషన్‌లోని వై-ఫై హెల్ప్ డెస్క్ నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 
30 నిమిషాల కార్డు ధర రూ.25 గానూ, 60 నిమిషాల కార్డు ధర రూ.35 గానూ నిర్ణయించారు. ఈ కార్డులు ఒకసారి కొన్న తర్వాత 24 గంటల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవి చెల్లవని, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కూడా ఈ వై-ఫై కార్డులు కొనుగోలు చేయవచ్చని బెంగుళూరు స్టేషన్‌కు చెందిన సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.