గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (09:45 IST)

జియో ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్ అప్రమత్తం.. ఫైబర్ కాంబో యూఎల్‌డీ 550 పేరుతో కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలో ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. ఈ ప్లాన్ ప్రమోషన్‌లో భాగంగా మూడు నెలల పాటు ఉచిత సేవలు అందించేందుకు జియో సిద్ధమవుతోంది.

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలో ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. ఈ ప్లాన్ ప్రమోషన్‌లో భాగంగా మూడు నెలల పాటు ఉచిత సేవలు అందించేందుకు జియో సిద్ధమవుతోంది. ఆ తర్వాత రూ.500తో 100 జీబీ డేటాను వినియోగదారులకు అందించనున్నట్లు సమాచారం. జియో 4జీ మొబైల్ సర్వీసు తరహాలోనే ఇది కూడా సంచలనం సృష్టించే ఛాన్సుండటంతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటి నుంచే అప్రమత్తమైంది. 
 
ఇందులోభాగంగా ట్రాయ్ లెక్కల ప్రకారం బీఎస్ఎన్ఎల్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులో కోటిమంది వినియోగదారులున్నారు. జియో ఆఫర్ల ధాటికి తట్టుకునే రీతిలో హోం బ్రాడ్‌బ్యాండ్ టారిఫ్ రేట్లను భారీగా తగ్గించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్లను మరోసారి సమీక్షిస్తామని, జియో టారిఫ్ ప్లాన్లతో సరిపోయలా చూస్తామని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ్ తెలిపారు.
 
మరోవైపు ఫైబర్ కాంబో యూఎల్‌డీ 550 పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద రూ.550తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 జీబీల డాటాను అందిస్తున్నట్లు టెలికం సర్కిల్ సీజీఎం అనంతరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, అలాగే ఆదివారం ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్ చేసుకునే సదుపాయం వినియోగదారులకు కల్పించినట్లు తెలిపారు.