Widgets Magazine

కేరళలో బీఎస్ఎన్ఎల్ 4జీ ఎల్‌టీఈ సేవలు ప్రారంభం

మంగళవారం, 26 డిశెంబరు 2017 (13:21 IST)

Widgets Magazine
bsnl logo

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ ఎల్‌టీఈ సేవలను ముందుగా కేరళలో ప్రారంభించనుంది. ఆపై ఒడిషాలో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా 3జీ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను మొదలెట్టనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు. 
 
ఎల్‌టీఈ సేవ‌లు అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు అత్యుత్త‌మ డేటా వేగాన్ని అందించే అవ‌కాశం క‌లుగుతుందని శ్రీవాత్సవ తెలిపారు. ఈ సేవలను కేరళ, ఒడిషాల తర్వాత దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందించి.. తద్వారా ప్రైవేట్ టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, జియోల‌తో పోటీని ఎదుర్కోవాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. 
 
ఎయిర్‌టెల్, జియో వొడాఫోన్‌ నుంచి ఎదురయ్యే పోటీని 4జీ సేవలు లేకపోవడంతో బీఎస్ఎన్ఎల్ తట్టుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు లేకపోవడంతో వెనకబడాల్సి వచ్చింది. ఇకపోతే.. బీఎస్ఎన్ఎల్‌కు దేశవ్యాప్తంగా (ముంబై, ఢిల్లీ సర్కిల్స్ మినహా) పది కోట్ల వినియోగదారులున్నారు. 4జీ ఎల్‌ఈటీ సేవల కోసం మార్చి 2018 నాటికి పదివేల 4జీ మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వూలివ్ నుంచి కొత్త ఫీచర్.. స్ట్రీమింగ్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదట..

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ వూలివ్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చింది. ...

news

ఈ ఫోన్లలో వాట్సప్‌ పనిచేయదు...

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని రకాల ...

news

జియో కస్టమర్లకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్... న్యూ ప్లాన్స్....

కొత్త సంవత్సరానికి ఇంకా మరో వారం రోజులు ఉండగానే తన కస్టమర్లకు జియో శుభవార్త తెలిపింది. ...

news

ప్రపంచంలోనే స్మాలెస్ట్ మొబైల్ ఫోన్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ అతి పెద్ద మొబైల్ ఫోన్‌ను (బిగ్ ...