Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్విచ్ ఆఫ్ చేసినా అది ఉంటే పక్కలో బల్లెమేనట. కాస్త దూరం జరగాల్సిందే..

హైదరాబాద్, గురువారం, 29 జూన్ 2017 (06:38 IST)

Widgets Magazine
htc one s9 smartphone

సెల్ ఫోన్ టవర్లు ఇంటి పక్క ఉంటే ఒక్క పక్షి కూడా బతకదని, ఇక మనుషులైతే దాని రేడియేషన్ తోనే చచ్చిపోతారని చాలాకాలంగా పరిశోధనలు చెబుతూ వచ్చాయి. ఇక గాలి పుకార్ల మాట చెప్పాల్సిన పని లేదు. కాని ఇప్పుడు మొబైల్ టవర్లు కాదట. స్మార్ట్ పోన్ మీ వద్ద ఉంటే చాలు. మీరు స్విచ్ఛ్ ఆఫ్ చేసినా దాని పని అది చేసుకుపోతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పని అంటే మాట్లాడటం కాదు. మీ బుర్రను పూర్తిగా తొలిచేస్తుందట. 
 
స్మార్ట్‌ఫోన్‌ రేడియేషన్‌తో ఆరోగ్య సమస్యలు వస్తాయన్న వార్తలు పూర్తిగా నిర్ధారణ కాకముందే ఆస్టిన్‌లోని టెక్సస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. స్మార్ట్‌ఫోన్‌ అనేది మన దగ్గర ఉంటే చాలు.. అది స్విచ్‌ఆఫ్‌లో ఉన్నా సరే మన మెదడు సామర్థ్యం తగ్గిపోతుందని వీరు అంటున్నారు. దాదాపు 800 మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులపై ప్రయోగాలు చేసి నిర్ధారణకు వచ్చినట్లు అడ్రియన్‌ వార్డ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. 
 
ఒక ప్రయోగంలో వీరందరికీ ఒక కంప్యూటర్‌ ద్వారా పరీక్ష పెట్టారు. కొంతమందికి స్మార్ట్‌ఫోన్‌ తమ వద్దే ఉంచుకొమ్మని, ఇతరులను పక్క గదిలో ఉంచమని చెప్పి ఈ పరీక్ష నిర్వహిం చారు. ఫోన్లన్నింటినీ ఆఫ్‌ చేసి ఉంచాలన్న సూచనలూ ఇచ్చారు. పక్క గదిలో ఫోన్‌ పెట్టిన వారి ఫలితలు కొంచెం మెరుగ్గా ఉండగా.. కళ్లముందు, జేబులో ఫోన్‌ పెట్టుకున్న వారు తక్కువ మార్కులు సాధించారు. 
 
ఫోన్‌ దగ్గర ఉన్న వారు.. తాము పనిపై దృష్టి పెట్టామని అనుకుంటారు గానీ ఎప్పుడో ఒకప్పుడు వారి ఆలోచనలు స్మార్ట్‌ఫోన్‌ పైకి వెళతాయని ఫలితంగా వారి ఆలోచన సామర్థ్యం తగ్గుతుందని తెలుస్తోందని  టెక్సస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జూలై ఒకటో తేదీ అమల్లోకి జీఎస్టీ: అప్పుడే తగ్గిన స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి

జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. జీఎస్టీకి దేశంలోని పలు రాష్ట్రాలు ఆమోదం ...

news

హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్: రూ.32,750కి ''హానర్ 9''

హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 'హానర్ 9' పేరిట మార్కెట్లోకి ...

news

200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న ఫేస్ బుక్.. 2012 ఆ రికార్డు బద్ధలు..

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ...

news

జూలై 6న వివో నుంచి ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్ ఫోన్లు: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు కూడా?

బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ...

Widgets Magazine