Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గూగుల్‌ పిక్సల్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇపుడు జస్ట్ రూ.28 వేలకే సొంతం

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:16 IST)

Widgets Magazine
google pixel

సెర్చ్ దిగ్గజం గూగుల్ పిక్సల్‌ స్మార్ట్ ఫోన్ ఇపుడు భారీ డిస్కౌంట్ ధరకు లభించనుంది. ఈ ఫోన్‌ను అక్టోబర్‌ 13న భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు, 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌లో 12.3మెగా పిక్సల్‌ వెనుక కెమెరా, 8ఎంపీ ముందు కెమెరా ఉన్నాయి. 4జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 7.1 నౌగత్‌ ఓఎస్‌ దీని ప్రత్యేకతలు.
 
అయితే యాపిల్, సామ్‌సంగ్‌ స్మార్ట్ ఫోన్లకు ధీటుగా పిక్సల్‌ను మార్కెట్‌లో అమ్ముకునేందుకు గాను గూగుల్ కంపెనీ ఏకంగా రూ.29వేలు తగ్గించింది. ప్రస్తుతం 32జీబీ వేరియంట్‌ ధర రూ.57వేలు కాగా, డిస్కౌంట్‌ పోను రూ.28వేలకే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.
 
ఒక కార్డుపై ఒకసారి మాత్రమే కొనుగోలుకు వీలుపడుతుంది. సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ఎక్స్ఛేంజి ఆఫర్‌ ద్వారా ఫోన్‌ కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్‌ వరిస్తుంది. క్రెడిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ ద్వారా నేరుగా చెల్లించేవారికి రూ.9వేలు తగ్గింపు వర్తిస్తుంది. ఈ మొత్తం మొబైల్‌ కొనుగోలు చేసిన 90రోజుల తర్వాత వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుంది. 
 
ఇక ఎక్స్ఛేంజి ద్వారా కొనుగోలుపై ఫోన్‌ బట్టి రూ.20వేల వరకు తగ్గింపు పొందొచ్చు. మొత్తంగా రూ.29వేలు అన్నమాట. ఇదే ఆఫర్‌ 128జీబీ వేరియంట్‌కూ వర్తిస్తుంది. ఆ మోడల్‌ ధర రూ.66 వేలు కాగా, డిస్కౌంట్‌ పోను రూ.37 వేలకు లభించనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ట్రంప్ దెబ్బ... ఐటీ ఉద్యోగులకు నో అప్రైజల్... టెక్ మహీంద్ర మొదలెట్టింది...

అమెరికా నూతన అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా భారతదేశ ఐటీ ...

news

భారత్‌లో ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 జాబ్స్ మటాష్ : వరల్డ్ బ్యాంక్ నివేదిక

భారతదేశంలోని ఐటీ ఉద్యోగాలు వాటి స్థితిగతులపై ప్రపంచ బ్యాంకు ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ...

news

స్క్రీన్ పగిలిపోయిందా? టచ్ పనిచేయడం లేదా? లాక్ తీయాలా.. ఇలా చేయండి?

అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ కింద పడి పూర్తిగా పగిలిపోయిందా? స్క్రీన్‌పై పగుళ్ళు ఏర్పడిన ...

news

మన సాఫ్ట్‌వేర్ పరిశ్రమను దెబ్బకొట్టేవాళ్లు ఇంతవరకూ పుట్టలేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ధీమా

దశాబ్దాలుగా బలపడి అతర్జాతీయ మార్కెట్‌లో గట్టిపునాది వేసుకున్న భారతీయ సాప్ట్‌వేర్ ...

Widgets Magazine