Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ అక్షింతలు: వాట్సాప్ డీల్‌‌లో మాట మారింది.. 12కోట్ల జరిమానా!

గురువారం, 18 మే 2017 (17:50 IST)

Widgets Magazine
facebook, Mark Zuckerberg

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. వాట్సాప్ టేకోవర్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో 12కోట్ల డాలర్ల జరిమానా విధించినట్లు యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. 
 
ఈ సందర్భంగా ఈయూ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్ విలీన నిబంధనలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. అయితే దీనిపై ఫేస్ బుక్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. యూరోపియన్ కమిషన్‌కు తాము పూర్తిగా సహకరించామని వెల్లడించింది. 
 
కాగా 2014లో వాట్సప్‌ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న సందర్భంగా ఈయూ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. అప్పట్లో ఫేస్ బుక్, వాట్సాప్‌లను వేర్వేరుగా ఉంచుతామని చెప్పిన ఫేస్ బుక్.. 2016లో మాట మార్చింది. ఫేస్ బుక్, వాట్సప్ రెండింటిలోనూ యూజర్ల సమాచారాన్ని కలిపే ఛాన్సుందని ప్రకటన చేయడంతో యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Facebook $122 Million European Union Whatsapp Deal Whatsapp Data

Loading comments ...

ఐటీ

news

రాన్సమ్ వేర్ సైబర్ అటాక్ ఇంకా ముగియలేదు.. ఏ క్షణంలోనైనా ఆండ్రాయిడ్?

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ ...

news

సైబర్ అటాక్‌తో జొమాటోకు కష్టాలు.. డేటాను దొంగలించి.. బేరానికి పెట్టేశారు..!

ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. ...

news

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ...

news

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. ఇప్పుడు ఐబీఎం వంతు.. 5 వేల ఉద్యోగాల ఊస్టింగ్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను దిగ్గజ టెక్ కంపెనీలు తు.చ. తప్పుకుండా ...

Widgets Magazine