Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే?

మంగళవారం, 27 జూన్ 2017 (18:28 IST)

Widgets Magazine

గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై యూరోపియన్ యూనియన్ సుదీర్ఘ విచారణ జరిపింది. చివరకు గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ సంస్థ ఏకంగా 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. గూగుల్ త‌మ సెర్చింజ‌న్‌లో చూపించిన ఆన్‌లైన్ షాపింగ్‌ స‌ర్వీస్ సంస్థ‌ల పేర్లు ఇత‌ర సంస్థ‌ల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని తేల్చింది.
 
సెర్చ్ ఇంజిన్‌గా పేరు కొట్టేసిన గూగుల్ సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీసులనే ప్రమోట్ చేసి.. ప్ర‌త్య‌ర్థి కంపెనీల డీమోట్ చేసింద‌న్న ఆరోప‌ణ‌లు గూగుల్‌పై ఉన్నాయి. తన ఆండ్రాయిడ్‌ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా ప్రత్యర్థులను అణచివేయడానికి  ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏడేళ్లుగా గూగుల్‌పై ప‌దుల సంఖ్య‌లో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వ‌స్తున్న సంగతి తెలిసిందే.  
 
దీనిపై విచార‌ణ జ‌రిపిన ఈయూ యాంటీట్ర‌స్ట్ విభాగం భారీ జ‌రిమానా విధించింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో త‌న షాపింగ్ స‌ర్వీస్‌లకు ఫేవ‌ర్ చేయ‌డాన్ని నిలిపేయాల‌ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్ర‌తిరోజూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వ‌చ్చే ట‌ర్నోవ‌ర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామ‌ని కూడా హెచ్చ‌రించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటి...

ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న నోకియా.. ఇపుడు మళ్లీ మార్కెట్‌లోకి ఫోన్లను ...

news

ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో స్మార్ట్ ఫెస్టివల్.. భారీగా ధరల తగ్గింపు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లెనోవో ఫెస్టివల్‌ పేరుతో స్మార్ట్ ఫోన్లను భారీ ...

news

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. మరో 3 నెలలు పొడగింపు

దేశీయ టెలికాం రంగంలో ధరల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ...

news

ఫ్లిఫ్‌కార్ట్‌ ఆఫ్‌లైన్లో షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌.. ఫీచర్లు ఇవే..

చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌ను ఆదివారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ...

Widgets Magazine