శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (16:40 IST)

కోట్లాది నకిలీ ఖాతాలపై ఫేస్‌బుక్ వేటు

అసత్య సమాచార వ్యాప్తిని నివారించి, నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ మరో ముందగుడు వేసింది. ఇందులోభాగంగా నకిలీ ఖాతాలపై ఫేస్‌బుక్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే 540 కోట్ల ఫేక్ ఖాతాలను ఫేస్‌బుక్ నిలిపివేసింది. 
 
నిఘా వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్​బుక్​ తెలిపింది. ఇందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. 
 
నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఈ ఏడాది రద్దు చేసినట్లు తెలిపింది. నకిలీ ఖాతాలను సృష్టించడానికి చేసే ప్రయత్నాలను పసిగట్టే పద్ధతులను మెరుగుపర్చుకున్నట్లు 'పారదర్శకత నివేదిక'లో ఫేస్​బుక్​ స్పష్టం చేసింది.