గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 మే 2015 (11:59 IST)

విదేశీ టాలెంట్ వైపు మొగ్గుచూపుతున్న ఫ్లిప్ కార్ట్!

దేశీయంగా లభిస్తున్న టాలెంట్‌తో ఈ-కామర్స్ రంగంలో అంతర్జాతీయ సంస్థలు అమేజాన్, అలీబాబాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఫ్లిప్ కార్ట్‌కు దేశీయంగా లభిస్తున్న టాలెంట్ సరిపోవడం లేదట. సంస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విదేశీ టాలెంట్ కావాల్సిందేనంటున్నారు ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పునీత్ సోనీ. 
 
మొన్నటిదాకా గూగుల్‌లో పనిచేసిన ఆయన ఇటీవలే ఫ్లిప్ కార్ట్‌లో చేరారు. భారత సంతతికి చెందిన పునీత్ సోనీ రాకతో ఫ్లిప్ కార్ట్ పనితీరు మరింత మెరుగుపడుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. అందుకనుగుణంగానే పనిచేస్తున్న ఆయన విదేశీ టాలెంట్ వైపు మొగ్గుచూపడం గమనార్హం. ఫ్లిప్ కార్టుకు విదేశీ టాలెంట్ తోడైతే తప్పకుండా ఈ-కామర్స్ రంగంలో తమ సంస్థ మెరుగైన ఫలితాలు రాబట్టుతుందని పునీత్ సోనీ వెల్లడించారు.