డెవలపర్లు - స్టూడెంట్స్‌కు గూగుల్ స్కాలర్‌షిప్‌లు

శుక్రవారం, 24 నవంబరు 2017 (07:11 IST)

google search

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ యువతను తయారు చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇందుకోసం టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్‌, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఉడాసిటీతో కలిసి ఓ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
 
ఈ భాగస్వామ్యంలో కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌తో లక్షా 30 వేల మంది డెవలపర్లకు, స్టూడెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30 వేల మందికి గూగుల్‌ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. 
 
ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా భారతీయ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, వర్చ్యూవల్‌ రియాల్టీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంది. ఈ కొత్త స్కాలర్‌షిప్‌ ప్రొగ్రామ్‌‌తో భారత్‌లో 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేసే లక్ష్యంతో గూగుల్‌ ముందుకు వచ్చింది. దీనిపై మరింత చదవండి :  
Offers Developers Students Google India 1.3 Lakh Scholarships

Loading comments ...

ఐటీ

news

జియోని నుంచి కొత్త మోడల్స్: 26న 8 ఫోన్లు విడుదల

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ ...

news

ఎంఐ బంపర్ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా ...

news

వైఫై డబ్బా: 1 జీబీ డేటా రూ.20 మాత్రమే.. రూ.2కి 100 ఎంబీల డేటా

రిలయన్స్ జియో ఉచిత డేటా పేరిట టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. జియోకు ...

news

3 సెకన్లలో 2 గంటల సినిమా డౌన్‌లోడ్‌.. ఇదీ 5జీ నెట్ స్పీడ్

దేశంలోని టెలికాం కంపెనీలు ఇంటర్నెట్ సేవలను అత్యంత వేగంగా అందించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ...