గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (13:41 IST)

హౌసింగ్ డాట్ కాం ఆఫీసర్ అవుట్ : హౌసింగ్ డాట్ కామ్ సైట్ హ్యాక్

హౌసింగ్ డాట్ కాం మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఆయన సంస్థను వీడిన వారం రోజుల్లోపే హౌసింగ్ డాట్ కాం వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ హ్యాకింగ్ వెనుక వెబ్ సైట్ గురించిన సర్వస్వం తెలిసిన రాహుల్ హస్తం ఉందని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, రాహుల్ మాత్రం తనకు హ్యాకింగ్‌కు సంబంధం లేదని తన ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో పోస్టింగ్‌ను ఉంచారు. 
 
ఇకపోతే.. హౌసింగ్ డాట్ కాం నుంచి రాహుల్ యాదవ్ తప్పుకున్నాక వెబ్ సైట్ హ్యాక్ కావడానికి ఆయనే కారణమంటూ వివిధ రకాల పోస్టింగ్‌లు విమర్శలతో వెల్లువెత్తుతున్నాయి. 'ఒక కంపెనీ నుంచి తొలగిస్తే ఏం చేయాలి? ఆ సంస్థ వెబ్ సైట్‌ను హ్యాక్ చేయాలి' అని ఒకరు, 'ఇతనికి నిజాయితీ అన్నదే లేదు.

మరెవరూ ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఎంత జోకర్ పనిచేశాడు' అని ఇంకొకరు, 'వెబ్ సైట్‌ను నిర్వహించేవారికన్నా హ్యాకర్లు శక్తిమంతులని రాహుల్ మరోసారి నిరూపించాడు' అని మరొకరు... ఇలా తమతమ ట్వీట్లతో రాహుల్‌పై మండిపడుతున్నారు. అయితే హ్యాకింగ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ యాదవ్ అంటున్నాడు.