Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పదేళ్ల తర్వాత ఐటీ హబ్స్‌లో 20 శాతం దాకా పతనమవనున్న అద్దెలు

హైదరాబాద్, మంగళవారం, 11 జులై 2017 (02:09 IST)

Widgets Magazine
housing sector

ఐటీ ఉద్యోగులు రాజభోగాలు అనుభవించినంత కాలం వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఇంటియజమానుల పంట పండేది. కానీ ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గిపోవడం, వేతన పెంపు ఆగిపోవడం ఇటు టెకీలకు మాత్రమే కాక, హౌజ్‌ ఓనర్లకు ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి. ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ హబ్స్‌లోని హౌజ్‌ ఓనర్లు అద్దెలను తగ్గించేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణె, నోయిడా, గుర్గావ్‌, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లోని ఐటీ హబ్స్‌లో వచ్చే మూడు క్వార్టర్‌లలో ఇళ్ల అద్దెలు భారీగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఇండస్ట్రి బాడీ అసోచామ్‌ అంచనావేస్తోంది. ఈ తగ్గింపు ఎక్కువగా పుణెలో 20 శాతానికి పైగా ఉంటుందని అధ్యయన రిపోర్టు వెల్లడించింది. 
 
'' బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ప్రాంతాల్లో మునుముందు కాలంలో ఇళ్ల అద్దెలు 10-15 శాతం తగ్గిపోనున్నాయి. పుణేలో ఎక్కువగా 20 శాతం పైగా తగ్గనున్నాయి. అదేవిధంగా గుర్గావ్‌, నోయిడాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోంది'' అని అసోచామ్‌ అధ్యయన రిపోర్టు పేర్కొంది. బెంగళూరులోని హౌజ్‌​ ఓనర్లకు సిలికాన్‌ వ్యాలీకి ఉన్నంత పేరు ఉంది. అద్దెళ్లను తగ్గిస్తూ మంచి సౌకర్యాలతో టెనంట్లను ఆకట్టుకుంటున్నామని వారు చెబుతున్నారు.
 
మంచి ఆప్షన్లతో అద్దెదారులకు అనుకూలంగా మార్కెట్‌ ఉందని, ముఖ్యంగా నెలకు రూ.50వేల కంటే ఎక్కువగా చెల్లించే వారికి అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నామని హౌజ్‌ఓనర్లు చెప్పినట్టు తెలిపింది. వెనకటి కాలంలో ప్రతేడాది వేలకొద్దీ ఉద్యోగులను రిజర్వ్ బెంచ్‌గా ఐటీ సంస్థలు నియమించుకునేవి.  ఆ నియామకాల ప్రక్రియకు అనుగుణంగానే బెంగళూరులో అద్దె ఇళ్లకు డిమాండ్‌ భారీగా పెరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెట్‌బేసిస్‌లో కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నప్పటికీ, అంత ఆకర్షణీయంగా లేదని అధ్యయన రిపోర్టు తెలిపింది. 
 
ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న ఐటీ, ఐటీ ఎనాబుల్‌ సర్వీసుల ప్రొఫిషినల్స్‌ వేతనం సగటున వార్షికంగా 20 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఉంటే, వారు అద్దెలు రూ.50వేల నుంచి రూ.1.5 లక్షల వరకు చెల్లిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది. రూ.15 వేల నుంచి రూ.35వేల మధ్యలో కూడా అద్దెలు ఉన్నాయని చెప్పారు. ఈ అన్ని సెగ్మెంట్లలో అద్దెలు తగ్గిపోయే అవకాశాలున్నాయని అధ్యయన రిపోర్టు చెప్పింది..  
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

షాకింగ్ న్యూస్ : జియో కస్టమర్ల సమాచారం లీక్?

షాకింగ్ న్యూస్. రిలయన్స్ జియో కస్టమర్ల సమాచారం లీక్ అవుతోంది. కస్టమర్ డేటాబేస్ హ్యాక్ ...

news

ఉద్యోగి తొలగింపులో అడ్డంగా దొరికిపోయిన టెక్ మహేంద్రా.. సారీ చెబితే ఏంటి.. పరువు పోయె

ఒక ఉద్యోగిని అర్థంతరంగా కంపెనీ నుంచి తొలగిస్తున్న సమయంలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ...

news

చార్జింగ్‌ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని ఫోను...

సాధారణంగా చేతిలో మొబైల్ ఉంటే ఖచ్చితంగా జైబులో చార్జరో, పవర్ బ్యాంకో ఉండాల్సిందే. లేకుంటే ...

news

4జీ టెక్నాలజీతో పనిచేసే.. ఫీచర్ ఫోన్ రూ.500లకే.. ఎవరిస్తున్నారు..?

టెలికం మార్కెట్లో మరో సంచనలనానికి రిలయన్స్ జియో రెడీ అయింది. అతి త్వరలో అత్యంత చౌక ధరలో ...

Widgets Magazine