బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi

మరణించాక ఫేస్ బుక్ పేజ్ ఓనర్ ఎవరో..?

మరణించాక ఫేస్ బుక్ పేజ్‌ను నిర్వహించే ఓనర్ ఎవరో..? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. మరణానికి అనంతం ఎఫ్‌బీ అకౌంట్‌ను నిర్వహించే వ్యక్తిని ముందుగానే నిర్ణయించే సదుపాయాన్ని టాప్ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కల్పించింది. నెట్టింట

మరణించాక ఫేస్ బుక్ పేజ్‌ను నిర్వహించే ఓనర్ ఎవరో..? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. మరణానికి అనంతం ఎఫ్‌బీ అకౌంట్‌ను నిర్వహించే వ్యక్తిని ముందుగానే నిర్ణయించే సదుపాయాన్ని టాప్ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కల్పించింది. నెట్టింట ఫేస్ బుక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఫేస్ బుక్ టాప్‌లో ఉంది. 
 
ఫేస్‌ బుక్‌ను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులకు అనుగుణంగా ఫేస్ బుక్ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే మరణానికి అనంతరం ఫేస్ బుక్ పేజీని ఎవరు నిర్వహిస్తారనే దానిపై ముందుగానే నిర్ణయించే ఆప్షన్‌ను కల్పించింది.

ఈ సదుపాయం ‘Legacy Contact' అనే పేరిట ఫేస్ బుక్‌లో ఉంటుందని.. అందులో మరణానికి అనంతరం ఫేస్ బుక్ పేజీని హ్యాండిల్ చేసేవారెవరో పేర్కొనవచ్చునని ఫేస్ బుక్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.