శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (14:35 IST)

భారత్‌లో 30 కోట్లు దాటనున్న ఇంటర్నెట్ వినియోగదారులు!

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ సంఖ్య 30 కోట్లు దాటనుందని తెలిపింది. ఈ యేడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య దారుతుందని తెలిపారు. 
 
మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం విస్తరిస్తున్న కొద్దీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆ సంస్థ వివరించింది. జనవరి నాటికి చైనా తర్వాత అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్న దేశంగా ఇండియా నిలవనుందని అంచనా వేసింది. 
 
కాగా, ప్రస్తుతం చైనాలో 60 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇండియాలో నెట్ వాడుతున్నవారి సంఖ్య కోటి నుంచి 10 కోట్లకు చేరడానికి 10 సంవత్సరాలు పడితే, అక్కడి నుంచి 20 కోట్లకు చేరడానికి మూడేళ్ళు, 30 కోట్లకు చేరడానికి 1 సంవత్సరం మాత్రమే పట్టింది.