Widgets Magazine

ఆ ఒక్కమాటతో ఐటీ షేర్లు కుదేల్.. కొంపలు ముంచి కూడా తానేమీ అనలేదన్న సీవోవో

హైదరాబాద్, గురువారం, 8 జూన్ 2017 (01:36 IST)

Widgets Magazine
infosys

ఒక చిన్న మాటను పై స్థానాల్లో ఉన్న వారు తూలితే ఒక కీలక రంగం ఎన్ని ఒడిదుడుకులకు లోనవుతుందో,  24 గంటల్లో ఎంత మార్పు వస్తుందో చూడాలంటే ఐటీ ఉత్థాన పతనాల చరిత్రే సాక్ష్యం. మంగళవారం స్టాక్ మార్కెట్లో భారీగా పుంజుకున్న ఐటీ దిగ్గజ సంస్థల షేర్లు ఒక్క రోజులోపే భారీ పతనాన్ని చవిచూశాయి. దీనికి కారణం ఇన్ఫోసిస్ సీఓఓ చేసిన  ప్రకటన. అంతర్జాతీయంగా తాము సేవలందిస్తున్న ఖాతాదారులు ఇకపై తమ ఐటీ రంగ వ్యయాలను తగ్గించుకోనున్నారన్న ఒక్క మాట ఆయన నోటినుంచి వెలువడిందో లేదో ఐటీ షేర్లు కుప్పగూలిపోయాయి.
 
ఇన్ఫీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ చేసిన  కమెంట్లు ఐటీ  షేర్ల కొంపముంచాయి. ఇన్పీ సీవోవో ప్రవీణ్‌ రావు తమ ఖాతాదారుల ఐటీ వ్యయాలను తగ్గనున్నాయన్న వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ  షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 
ఇన్ఫోసిస్‌ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ సెక్టార్ లో  తీవ్ర అమ్మకాల  వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా నిన్నటి మార్కెట్‌ లో భారీ పుంజుకున్న ఐటీ దిగ్గజ  షేర్లు  భారీ పతనాన్ని నమోదు చేశాయి.  
 
తమ క్లయింట్స్‌ ఐటీ  వ్యయాలను చూస్తున్నారంటూ ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు బుధవారం  మీడియాతో  వ్యాఖ్యానించారు. తమ అంతర్జాతీయ ఖాతాదారులు  బిల్లింగ్‌ రేటును దాదాపు 50శాతం తగ్గించాలని  చూస్తున్నారన్నారు. ఇది 150 బిలియన్ డాలర్ల  దేశీయ  పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపించనుందని చెప్పారు.  
 
దీంతో  ఇన్వెస్టర్లలో  భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో  దాదాపు అన్ని  ఐటీ షేర్లలో  భారీ సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపించింది.  ఐటీ మేజర్లు ఇన్ఫీ, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ సహా ఇతర టెక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇన్ఫీ యాజమాన్యం   వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది.  మిడ్‌సెషన్‌ తరువాత  ప్రధానంగా ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి.
 
అంతా జరిగిపోయాక  ఇన్ఫోసిస్ సీవోవో ఫక్తు రాజకీయ నేతలాగే వ్యవహరించారు. తమ సంస్థ ఖాతాదారుల నుంచి తమకు వచ్చే ఆదాయం తగ్గలేదని తాను అనలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని యుబి ప్రవీణ్ రావు వివరించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వాట్సప్ షెడ్యూలర్ గురించి తెలుసా?

వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను అనుకున్న సమయానికి పంపేందుకు వీలుగా గూగుల్ ప్లే స్టోర్‌‌లో ...

news

డేటా ప్లాన్ల జాప్యం.. మొబైల్ ఆపరేటర్లపై ట్రాయ్ ఫైర్.. కాల్ నాణ్యత కోసం మైకాల్ యాప్ ఆవిష్కరణ

దీర్ఘకాలిక గడువులతో కూడిన డేటా ప్యాకులకు అనుమతులు ఇచ్చినప్పటికీ చాలా టెలికాం కంపెనీలు ...

news

అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు.. ఐస్ బ్రాండ్‌‌తో మార్కెట్లోకి..

ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లోకి రావాలని ప్లాన్ ...

news

నుబియా సిరీస్‌తో చైనా జడ్‌టీఈ నుంచి నుబియా జడ్ 17-ఫీచర్స్ ఇవే

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ జడ్‌టీఈ నుబియా సిరీస్‌తో తన కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ...