Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో కస్టమర్లకు శుభవార్త : 2017 మార్చి వరకు ఉచిత ఆఫర్..

గురువారం, 1 డిశెంబరు 2016 (14:06 IST)

Widgets Magazine
reliance jio

రిలయన్స్ జియో సిమ్ వినియోగదారులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని శుభవార్త అందించారు. గురువారం ముంబైలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులు వచ్చే ఏడాది మార్చి 31 వరకు సేవలు ఉచితంగా ల‌భిస్తాయ‌ని ప్ర‌క‌టించారు. అదేసమయంలో నెంబరు పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
ఈ నెల 31 నుంచి దేశంలోని 100 న‌గ‌రాల్లో వినియోగ‌దారులు ఆర్డ‌ర్ చేసుకుంటే ఇంటి వ‌ద్ద‌కే జియో సిమ్‌ను పంపే సౌల‌భ్యాన్ని తీసుకొస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 5 కోట్ల మంది జియో సిమ్‌ను తీసుకున్నార‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తంచేశారు. జియో నంబర్లకు వచ్చే కాల్స్‌ను ఇతర నెట్‌వర్క్ ఆపరేట్లు బ్లాక్ చేస్తున్నారనీ, ఇలా మొత్తం 900 కోట్ల కాల్స్‌ను బ్లాక్ చేసినట్టు ఆయన తెలిపారు. 

ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే అత్యంత వేగంగా జియో వృద్ధి చెందుతోందన్నారు. అలాగే, అత్యంత సాంకేతికతను అందించే సంస్థ జియో అని తెలిపారు. జియోతో ప్రతిరోజు 6 లక్షల మంది వినియోగదారులు అనుసంధానం కావడం సంతోషమన్నారు. ఇతర నెట్‌వర్క్‌లతో పోల్చితే జియో 25 రెట్లు అధిక వేగమని తెలిపారు. తమను నమ్మిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
సలహాలు, సూచనలు స్వీకరించేందుకు లాంచింగ్ ఆఫర్ ఇచ్చామన్నారు. జియో అంత్యంత వేగంగా 5 కోట్ల వినియోగదారులన సంఖ్యను అధిగమించిందన్నారు. జియో వినియోగదారులకు ఇరత నెట్‌వర్క్‌లు సహకరించడంలేదని తెలిపారు. జియో సర్వీసులో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ తీసుకు రమ్మన్నామని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

కస్టమర్లు సంతృప్తికరంగా లేరు.. వెల్‌కమ్ ఆఫర్‌ పొడగింపు దిశగా జియో

రిలయన్స్ జియో కస్టమర్లు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. నెట్‌వర్క్, కాల్ డ్రాప్ సమస్యతో పాటు ...

news

ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? ఇమేజ్ గేట్ వైరస్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వాడేవారు?

సోషల్ మీడియా ప్రభావం.. చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఫ్రీ డేటా ఇంకేముంది.. సినిమాలు, పాటలు, ...

news

జియో సూపర్ రికార్డు: రోజుకు సగటున ఆరు లక్షల ఖాతాదారులతో..?

సంచలనాలకు కేంద్రంగా మారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్, ఉచిత ...

news

రిలయన్స్ జియో గుడ్ ‌న్యూస్.. 2017 మార్చి వరకు వెల్‌కమ్ ఆఫర్

రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం జియో మొబైల్ ...

Widgets Magazine