ఇక జియో ఫోన్‌లో వాట్సాప్ యాప్..

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (16:43 IST)

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో విడుదల చేసిన జియో ఫోన్‌లో వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జియోఫోన్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. గత నెల 15 నుంచి వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను అందుబాటులో తెస్తామని జియో ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. 
 
తాజాగా దేశ వ్యాప్తంగా జియో ఫోన్‌‌లో తొలిసారి వాట్సాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. వాట్సాప్‌ కోసం జియోఫోన్‌లో ప్రత్యేకమైన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (కైఓఎస్)ని డెవ‌ల‌ప్ చేశారు. వాట్సాప్ యాప్‌ను ఉపయోగించాలనుకునే జియోఫోన్ వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుందని సంస్థ తెలిపింది. 
 
ఆపై త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను వెరిఫై చేసుకోవ‌డం ద్వారా జియో ఫోన్ యూజ‌ర్లు వాట్సాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అన్ని జియో ఫోన్లలో సెప్టెంబరు 20 నుంచి వాట్సాప్‌ అందుబాటులోఉంటుందని జియో తెలిపింది. కాగా భారత దేశంలో జియో భారీ అమ్మకాలను నమోదు చేసింది పేర్కొంది. 215 మిలియన్ వినియోగదారులతో ప్రపంచ రికార్డులను సృష్టించిన జియో లాంచ్‌ చేసిన జియో ఫోన్‌ కీలక మైలురాళ్లను అధిగమించింది.

పోకో ఎఫ్1 ఫోన్‌ని లాంఛ్ చేసిన క్జియోమీ

చైనా మొబైల్ సంస్థ క్జియోమీ భారత మార్కెట్‌లోకి సరికొత్త మోడళ్లలో మొబైల్‌లను విడుదల చేస్తూ ...

వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్.. భారత్‌లో ప్రత్యేక కార్యాలయం వుండాలి

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అంతేగాకుండా సోషల్ ...

పబ్లిక్‌ టాయిలెట్ ఆచూకీ తెలిపే టాయిలెట్ ఫైండర్ యాప్

రమ్య తన ఆరేళ్ళ కుమార్తెతో కలిసి షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో పాపకు ...

జియోకు షాక్.. రూ.99కే వోడాఫోన్ న్యూ ప్లాన్

రిలయన్స్ జియోకు షాకిచ్చేలా వోడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదీకూడా రూ.99కే ఈ ...