Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో నెంబర్-1: అప్‌లోడ్ వేగంలో మాత్రం డౌన్

శనివారం, 30 డిశెంబరు 2017 (08:58 IST)

Widgets Magazine
JioFi

ఉచిత డేటా ఆఫర్‌తో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో నవంబరులో జియో అగ్రస్థానంలో నిలించింది. దీంతో టెలికాం నియంత్రణ సంస్థ నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో జియో నెంబర్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తర్వాతి  స్థానాల్లో నిలిచాయి.
 
విచిత్రంగా ఆ నెలలో అప్‌లోడ్ వేగంలో జియో నాలుగో స్థానానికి పడిపోయింది. 7.1 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబరులో 21.9 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్‌లోడ్ వేగం నవంబరులో తగ్గిపోగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు వృద్ధి సాధించాయి.
 
అక్టోబరులో ఎయిర్‌టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ వేగం వరుసగా 7.5, 8.7 ఎంబీపీఎస్‌గా నమోదు కాగా నవంబరులో 9.3, 9.9గా నమోదైంది. టెలికం ఆపరేటర్లు ఇటీవల అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలను క్రమంగా పెంచుతూ పోతున్నప్పటికీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ స్థానం 109వ స్థానంలోనే నిలిచిపోయింది. 
 
ఇదిలా ఉంటే.. స్పెక్ట్రం, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో సహా తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన మొబైల్ వ్యాపార ఆస్తులను అన్నయ్య ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కైవసం చేసుకోనుంది. ఇందులో భాగంగా ఓ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్.. రూ.93 ప్లాన్‌తో 1 జీబీ డేటా

జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ ఆఫర్లు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. ఇటీవల రూ. 98 రీఛార్జీతో ...

news

జియోకు పోటీగా ఐడియా ఆఫర్.. రూ.309లకే రోజుకు 1.5 జీబీ డేటా

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా టెలికాం సంస్థలన్నీ వినియోగదారులకు ఆఫర్ల ...

news

ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరి కానుందా?

ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ...

news

దేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్మకం కోసం గూగుల్ స్టోర్లు

సెర్చింజన్‌గా పేరున్న గూగుల్ సంస్థ ఇక స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై దృష్టి సారించింది. ఇందులో ...

Widgets Magazine