శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (20:03 IST)

మార్కెట్లోకి ఐరిస్ ఫ్యూయెల్ 60 స్మార్ట్ ఫోన్‌!

మార్కెట్లోకి ఐరిస్ ఫ్యూయెల్ 60 స్మార్ట్ ఫోన్‌ విడుదలైంది. మంగళవారం న్యూఢిల్లీలో ఐరిస్ ఫ్యూయెల్ 60 స్మార్ట్ ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి లావా సంస్థ ప్రోడక్ట్ హెడ్ ఉపాధ్యక్షుడు నవీన్ చావ్లా విడుదల చేశారు. దీని ధర రూ. 8,888 రూపాయలు. 
 
ఈ ఫోన్ ఐదు ఇంచ్‌ల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే కలిగివుంటుంది. ఇది 720 x 1280 పిక్సెల్స్‌తో కూడినది. గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్‌తో కూడిన స్క్రీన్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. ఒక జీబీరామ్, 32జీబీ మైక్రోSD కార్డును కలిగివుంటుంది.