గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (15:36 IST)

నోకియా పేరు లేకుండా మైక్రోసాఫ్ట్ లూమియా ఫోన్ : ధర రూ.9,199

అంతర్జాతీయ మొబైల్ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందిన నోకియా పేరు ఇపుడు కనుమరుగైపోయింది. ఈ కంపెనీని మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసుకోవడంతో తొలిసారి నోకియా బ్రాండ్ పేరు లేకుండానే మైక్రోసాఫ్ట్ లూమియా పేరుతో సరికొత్త మొబైల్ మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర రూ.9199గా ఉంది. 
 
ఇందులో యువత కోరుకునే ఫీచర్లన్నీ ఉన్నాయి. వన్‌డ్రైవ్‌, అవుట్‌లుక్‌, స్కైపి, బింగ్‌, ఎంఎస్‌ఎన్‌, ఎక్స్‌బాక్స్‌ తదితర సర్వీసులతో మరిన్ని ఉత్పత్తులను అందిస్తామని మైక్రోసాఫ్ట్‌ ఇండియా సంస్థ ప్రకటించింది. లుమియా 535 కొన్నవారికి రెండునెలల పాటు 500 ఎంబి డేటాను వొడాఫోన్‌ భాగస్వామ్యంతో అందిస్తున్నట్లు చెప్పారు.
 
ఈ మొబైల్ ఫోన్‌లో 1 జిబి ర్యామ్‌, 1.2 గిగాహెట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 5 అంగుళాల డిస్‌ప్లే, 8 జిబి అంతర్గత మెమరీ, (128 జిబి వరకు ఎక్స్‌పాండ్‌), 15 జిబి ఉచిత ఆన్‌డ్రైవ్‌ స్టోరేజి చేసుకొనే సదుపాయం ఉంది.