శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (12:47 IST)

మైక్రోసాఫ్ట్ నుంచి ల్యూమియా 535 స్మార్ట్ ఫోన్!

నోకియా పేరు తొలగించిన కొద్ది రోజులకే మైక్రోసాఫ్ట్ నుంచి 'ల్యూమియా' బ్రాండ్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తొలి మైక్రోసాఫ్ట్ ల్యూమియా 535 స్మార్ట్ ఫోన్‌ను ఈ నెల 26 లాంచ్ చేస్తున్నారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ఇండియా ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా పంపిందట. 
 
"ఐదు రోజుల్లో ట్రిపుల్ 5 మ్యాజిక్" అంటూ ఆహ్వానంలో తెలిపింది. అంటే "5x5x5" మైక్రోసాఫ్ట్ ల్యూమియా 535ను సూచిస్తుంది. ఈ ఫోన్ వివరాల్లోకి వెళితే, సింగిల్ సిమ్, డ్యూయెల్ సిమ్ అంటూ అదే పేరుతో రెండు రకాలుగా ఈ విండోస్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది.