శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:58 IST)

మైక్రో సాఫ్ట్‌కు స్మార్ట్ ఫోన్ బిజినెస్ కలిసొస్తుందా..? సరికొత్త ఫీచర్స్‌తో Surface Phone...

మైక్రో సాఫ్ట్‌కు మొబైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విభాగంలో నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ విభాగాల్లో పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్.. మొబై

మైక్రో సాఫ్ట్‌కు మొబైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విభాగంలో నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ విభాగాల్లో పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్.. మొబైల్ ఫోన్స్‌ విక్రయాల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు చాలా కష్టాలు పడుతోంది. ఇంకా ఈ విభాగంలో నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. 
 
తాజాగా స్మార్ట్ ఫోన్ల విభాగంలో టెలికాం సంస్థలతో పోటీ పడాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఇందులో భాగంగా మైక్రో సాఫ్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి వస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ ‌ఫోన్‌ను కస్టమర్ల అందుబాటులోకి తెచ్చేందుకు మైక్రోసాఫ్ట్ రెడీ అయ్యింది. మైక్రోసాఫ్ట్ సర్ఫేజ్ ఫోన్‌ గురించి ప్రముఖ డిజైనర్ టర్నోవిస్కీ మాట్లాడుతూ.. బీజిల్-లెస్ స్క్రీన్‌ను ఈ ఫోన్ కోసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 
 
ZTE Nubia ఫోన్లు మినహా.. ఏ ఒక్క ఫోన్లోనూ Bezel-less screen కనిపించదని చెప్పారు. ఈ ఫోన్‌లో అదనపు కీబోర్డు ఉంటుంది. సర్ఫేజ్ పెన్ సపోర్ట్‌ను కలిగి వుంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్ Surface Phone వెనుక భాగంలో మూడు ప్రత్యేకమైన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్‌లను ఏర్పాటు చేశారు.