Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నోకియా 2: జియోతో కలిసి బండిల్ ఆఫర్.. ఉచిత డేటా

శుక్రవారం, 24 నవంబరు 2017 (08:45 IST)

Widgets Magazine

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు నోకియాను కైవసం చేసుకున్న హెచ్ఎండీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ పాత కస్టమర్లను తిరిగి రప్పించుకునేందు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ఫోన్ నోకియా 2ను ప్రస్తుతం రిలయన్స్ జియోతో కలిసి బండిల్ ఆఫర్ ప్రకటించింది. 
 
ఈ జియోతో కలిసి ఉచిత డేటా ఆఫర్‌ను దేశవ్యాప్తంగా అన్నీ రీటైల్ మొబైల్ స్టోర్లలోనూ నోకియా 2 అందుబాటులో తేనుంది. దీని ధర రూ. 6,999 మాత్రమే. ఇక ఈ ఫోనును కొనుగోలు చేసిన వినియోగదారులకు 45 జీబీ 4జీ డేటాను ఉచితంగా లభిస్తుంది. అంతేగాకుండా వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు తొమ్మిది రీచార్జ్‌లతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
 
అలాగే కాప్లిమెంటరీ కింద ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ బీమాను కల్పిస్తోంది. రూ.1000తో కోటక్ 811 సేవింగ్స్ ఖాతా తెరిచిన వారికి ఈ బీమా వర్తిస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా హెడ్ అజయ్ మెహతా తెలిపారు.
 
నోకియా 2 ఫీచర్ల సంగతికి వస్తే..
ఈ ఫోన్ ఒన్ జీబీ ర్యామ్‌ను కలిగివుంటుంది. 
128 జీబీ వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటును కలిగివుంటుంది. వీటితో పాటు 5 అంగుళాల డిస్‌ప్లే, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ, 8 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4100 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఈ ఫోన్ కలిగివుంటుందని అజయ్ మెహతా చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

డెవలపర్లు - స్టూడెంట్స్‌కు గూగుల్ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ ...

news

జియోని నుంచి కొత్త మోడల్స్: 26న 8 ఫోన్లు విడుదల

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ ...

news

ఎంఐ బంపర్ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా ...

news

వైఫై డబ్బా: 1 జీబీ డేటా రూ.20 మాత్రమే.. రూ.2కి 100 ఎంబీల డేటా

రిలయన్స్ జియో ఉచిత డేటా పేరిట టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. జియోకు ...

Widgets Magazine