గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (17:29 IST)

నోకియాకు డూప్ వేస్తున్న మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్.. 4జీతో ఎక్స్1ఐ రిలీజ్..

నోకియా నుంచి 3310 ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు రూ.3310 ధర పలుకుతున్నాయి. రూ.3000 బడ్జెట్‌లో 2జీ కనెక్టివిటీతో కూడిన ఈ ఫోన్లను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంల

నోకియా నుంచి 3310 ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు రూ.3310 ధర పలుకుతున్నాయి. రూ.3000 బడ్జెట్‌లో 2జీ కనెక్టివిటీతో కూడిన ఈ ఫోన్లను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో మైక్రోమాక్స్ సంస్థ 4జీ కనెక్టివిటీతో చౌక ధరలో ఫీచర్ ఫోనును విడుదల చేసింది. చూసేందుకు నోకియా 3310ను పోలి వున్న ఈ కొత్త ఫీచర్ ఫోన్ మైక్రోమాక్స్ ఎక్స్‌1ఐ అనే పేరిట మార్కెట్లోకి రిలీజైంది. దీని ధర రూ. 1,399.
 
మైక్రోమాక్స్ ఎక్స్1ఐ ఫీచర్లు.. 
2.4 ఇంచ్ డిస్‌ప్లే, డుయెల్ సిమ్ 
విజీఏ కెమెరా, 32 ఎంపీ ఇంటర్నెల్ మెమరీ
1300 ఎంఎహెచ్ బ్యాటరీ, వైర్‌‍లెస్ ఎఫ్ఎమ్ రేడియా 
వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్
ఆటో కాల్ రికార్డింగ్ సౌలభ్యం 
అయితే నోకియా ద్వారా ఫేమస్ అయిన స్నేక్ గేమ్ ఇందులో మాత్రం లేదు.