శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (16:16 IST)

గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఎక్కువగా హీట్ కాకుండా వుండాలా?

గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఎక్కువగా హీట్ కాకుండా వుండాలా? అయితే జడ్‌టీఈకి చెందిన సబ్ బ్రాండ్ నూబియా నుంచి విడుదలైన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్ మ్యాజిక్ 3ఎస్‌ను కొనండి అంటోంది.. సదరు సంస్థ. గేమ్ ఆడితే ఫోన్ హీట్ కాకుండా వుండేందుకు.. ఇందులో ప్రత్యేకంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అందిస్తున్నట్లు నూబియా తెలిపింది. 
 
ఇందులో 6.65 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ హెచ్‌డీఆర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్ తదితర అద్భుతమైన ఫీచర్లు వున్నాయి. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ కెమెరాతోపాటు మరో 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండు కెమెరాలతో ఏకంగా 8కె రిజల్యూషన్ కలిగిన వీడియోలను షూట్ చేసుకునే సదుపాయం వుంది. 
 
నూబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ స్మార్ట్‌ఫోన్ మెకా సిల్వర్, సైబర్ షేడ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.35,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.47,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 21వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.
 
నూబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ ఫీచర్ల సంగతికి వస్తే.. 
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
బ్లూటూత్ 5.0, 
యూఎస్‌బీ టైప్ సి, 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 
ఫాస్ట్ చార్జింగ్.