శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (14:49 IST)

రివర్సబుల్ సౌకర్యంతో తొలి స్మార్ట్ ఫోన్: 10 గిగాబైట్ల వేగంతో డేటా

రివర్సబుల్ సౌకర్యంతో తొలి స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. త్వరలో తాము విడుదల చేసే స్మార్ట్ ఫోన్లో యూఎస్ బీ టైప్-సీ కనెక్టరును వాడుకోవచ్చునని వన్ ప్లస్ ప్రకటించింది. చైనాలో లీటీవీ అనే సంస్థ ఓ స్మార్ట్ ఫోన్‌ను ఇదే సౌకర్యంతో విడుదల చేసినప్పటికీ, ఆ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ నేపథ్యంలో టైప్-సీ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా సెకనుకు 10 గిగాబైట్ల వేగంతో డేటాను బట్వాడా చేసుకోవచ్చునని గూగుల్ ప్లస్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ప్రకటన విడుదల చేసింది. 
 
టైప్-సీ కనెక్టివిటీని వాడటం ద్వారా మరింత వేగంగా ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చని గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇకపోతే.. ప్రస్తుతం యాపిల్ మార్కెటింగ్ చేస్తున్న 12 అంగుళాల మ్యాక్ బుక్‌లో టైప్-సి కన్వర్టర్ సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.