గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (15:59 IST)

కార్డు స్వైప్ లేకుండానే చెల్లింపులు.. పేటీఎం కొత్త యాప్

చిల్లర కష్టాల నుంచి దేశ ప్రజలను గట్టెక్కించే చర్యలను ఒక్కో సంస్థ తమకు తోచిన విధంగా చేస్తోంది. ఇందులోభాగంగా పేటీఎం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌తో చిల్లర దుకాణాల్లో చెల్లింపులు జరిపేందుకు వె

చిల్లర కష్టాల నుంచి దేశ ప్రజలను గట్టెక్కించే చర్యలను ఒక్కో సంస్థ తమకు తోచిన విధంగా చేస్తోంది. ఇందులోభాగంగా పేటీఎం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌తో చిల్లర దుకాణాల్లో చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు లభిస్తుంది. 
 
ఈ చెల్లింపులు జరిపేందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. అతని వద్ద ఉన్న పేటీఎం యాప్‌లో మీ కార్డు వివరాలు, ఫోన్‌ నెంబరు నమోదు చేయగానే మీ మొబైల్‌కు ఓ ఓటీపీ(ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. 
 
దీన్ని యాప్‌లో నమోదు చేయగానే మీ బిల్లు చెల్లింపు జరిగిపోతుంది. తాజా అప్‌డేట్‌ ద్వారా చిన్న దుకాణాదారులకు.. ఇటు చిల్లర దొరక్క ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మేలు జరుగుతుందని కంపెనీ భావిస్తోంది.