Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియోతో పోటీ.. ఆర్‌కామ్ ప్లాన్.. 4జీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు తగ్గింపు

శుక్రవారం, 16 జూన్ 2017 (12:36 IST)

Widgets Magazine

టెలికామ్ రంగంలో పోటీ తారాస్థాయికి చేరుతుంది. ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీ ఇచ్చేందుకు ప్రస్తుతం టెలికోలన్నీ ఏకమవుతున్న వేళ.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా ఆఫర్లను తగ్గించేందుకు రెడీ అయిపోయింది.

జియో పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో భాగంగా.. ఆర్ కామ్ తాజాగా 4జీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను 28 శాతం మేర తగ్గించేసింది. ఢిల్లీ, ముంబై, మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ సర్కిళ్లలో ఇవి అమల్లో ఉంటాయి. 
 
ఈ క్రమంలో ప్రస్తుతమున్న రూ.699, రూ.499లకు తగ్గించగా రూ.499, రూ.399 ప్లాన్లు ఇక రూ.299, రూ.239కే పొందే అవకాశం కల్పించనున్నట్లు ఆర్కామ్ వెల్లడించింది. రూ.499 ప్లాన్ కింద 30జీబీ ఉచిత డేటా పొందొచ్చు. అన్ని నెట్ వర్క్‌లకు అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

నెలలో 3,000 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ అని ఆర్‌కామ్ తెలిపింది. ఆర్‌కామ్-ఇషాప్.కామ్ నుంచి ఈ ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చునని కంపెనీ ప్రకటించింది. ఇంకా ఒక జీబీ డేటాను రూ.16.66కే అందించనున్నట్లు ఆర్‌కామ్ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.444లకే చౌక డేటా ఆఫర్- పోటీ పడుతున్న టెలికాం సంస్థలు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో దూసుకెళ్తోంది. జియో దెబ్బతో పాటు ...

news

బెంగళూరులో రూ.1,100 కోట్ల పెట్టుబడి-ఇంటెల్ నుంచి 18 మాసాల్లో 3వేల ఉద్యోగాలు

బెంగళూరులో చిప్ తయారీలో పేరొందిన ఇంటెల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ...

news

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన 4 ఐటీ కంపెనీలు.. యాహూ ఉద్యోగులకు చేదు వార్త

హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ ...

news

జియో ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్ అప్రమత్తం.. ఫైబర్ కాంబో యూఎల్‌డీ 550 పేరుతో కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలో ఫైబర్ సేవలను ...

Widgets Magazine